ఔరా టూనా : చేప ఖరీదు రూ.21 కోట్లు

చేప ఖరీదు రూ.21 కోట్లు..సముద్రంలో మాత్రమే దొరికే టూనా చేప.పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర  రూ. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 21కోట్లు..ఏంటీ అవునా..అనిపిస్తోంది కదూ..టూనానా మజాకానా..

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 11:44 AM IST
ఔరా టూనా  : చేప ఖరీదు రూ.21 కోట్లు

చేప ఖరీదు రూ.21 కోట్లు..సముద్రంలో మాత్రమే దొరికే టూనా చేప.పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర  రూ. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 21కోట్లు..ఏంటీ అవునా..అనిపిస్తోంది కదూ..టూనానా మజాకానా..

చేప ఖరీదు రూ.21 కోట్లు..
సముద్రంలో మాత్రమే దొరికే 
బ్లూఫిన్‌ టూనా చేప
టోక్యో: చేపల్లో వుండే రకాన్ని బట్టి..రుచిని బట్టి కిలో రూ. 200 నుంచి ఐదారు వందలు పలుకుతుంది. మరీ అంటే గోదావరిలో సీజన్ లో మాత్రమే దొరికే పులస చేప వెరీ వెరీ కాస్ట్ అని ఇప్పటి వరకూ అనుకున్నాం. పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర  రూ. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 21కోట్లు..ఏంటీ అవునా..అనిపిస్తోంది కదూ..టూనానా మజాకానా..

సముద్ర చేపల్లో అత్యంత రుచిరకంగా ఉండే చేపగా టునా చేపకు ఎంతో పేరుంది. ఈ చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి ఎందుకంటే వీటి సంఖ్యే తక్కువ మరి. అందుకే అంత రేటు దీనికి.దీంతో వీటిని వేలం వేస్తారు. టోక్యోలోని ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సుకిజీ చేపల మార్కెట్లో ఏటా నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున టునా చేపల వేలం కార్యక్రమం జరుగుతుంది. గతేడాది ఈ చేపల మార్కెట్‌ను సుకిజీ నుంచి టొయోసుకు మార్చారు. ఈ ఏడాది టొయోసు మార్కెట్లో జరిగిన వేలంలో 278 కిలోల భారీ బ్లూఫిన్‌ టునా చేప ఏకంగా రూ. 21కోట్లు పలికింది.

స్థానిక సుషీ రెస్టారెంట్ల యజమాని కియోషీ కిమురానే ఈ సారి కూడా బ్లూఫిన్‌ టునాను దక్కించుకున్నారు. వేలంలో ఈ చేపను 333.6 మిలియన్‌ యన్‌లకు అంటే మన  కరెన్సీలో దాదాపు రూ. 21కోట్లు అన్నమాట. టునా చేపకు జపాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. సుషీ రెస్టారెంట్లలో ఈ చేప ఓ ముక్క ధర రూ. వేలల్లో ఉంటుంది. ఈ సారి ధర కాస్త ఎక్కువైనప్పటికీ కస్టమర్ల నుంచి అంతే స్థాయిలో డిమాండ్‌ ఉంటుందని కిమురా ఆనందపడిపోతున్నాడు.