Hyderabad News: కుక్కపై రాయి విసిరాడని రాళ్ళూ.. ఇనుప రాడ్లతో దాడి!

చిలికి చిలికి గాలి వాన అయిన వివాదాలు, తగాదాలు, గొడవల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. ఇలాంటి గొడవలు మొదలయ్యే సమయంలో అంత పెద్ద రాద్ధాంతం అవుతుందని వాళ్ళు కూడా అనుకోరేమో. చివరికి అవి గాయాలు, ప్రాణాలు పోవడం, పోలీసు కేసులు అంత పెద్దవి అయి చివరికి నానారాద్దంతం అయిపోతుంటాయి.

Hyderabad News: చిలికి చిలికి గాలి వాన అయిన వివాదాలు, తగాదాలు, గొడవల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. ఇలాంటి గొడవలు మొదలయ్యే సమయంలో అంత పెద్ద రాద్ధాంతం అవుతుందని వాళ్ళు కూడా అనుకోరేమో. చివరికి అవి గాయాలు, ప్రాణాలు పోవడం, పోలీసు కేసులు అంత పెద్దవి అయి చివరికి నానారాద్దంతం అయిపోతుంటాయి. అలాంటి వివాదమే ఒకటి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుక్కపై రాయి విసరగా ఆ కుక్క యజమాని రాయి విసిరిన వ్యక్తిపై దాడి చేశాడు.

తనపై దాడిని సహించలేని రాయి విసిరిన వ్యక్తి తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడకి వచ్చారు. ఈ లోగా కుక్క యజమాని తరపున ఇంకో బ్యాచ్ వచ్చింది. చివరికి కుక్క యజమాని అండ్ కో అవతలి వారిని రాళ్ళూ, ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చివరికి వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందినగర్‌లో సందీప్, మనోజ్ అనే యువకులు శనివారం రాత్రి బస్టాప్ నుంచి ఒక గ్రౌండ్ మీదుగా వారుండే గదికి వెళుతున్నారు.

ఆ ఖాళీ స్ధలంలోనే సందీప్ మూత్ర విసర్జనకు వెళ్లగా అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే శ్రీను అనే వ్యక్తి పెంపుడు కుక్కలతో అదే స్థలానికి వచ్చాడు. అయితే కుక్కలు తనవైపుకు రావడంతో భయపడిపోయిన సందీప్ రాయి విసిరాడు. తన కుక్కపైనే రాయి వేస్తావా అంటూ శ్రీను అసభ్య పదజాలంతో సందీప్‌ను దూషించి చేయి చేసుకున్నాడు. ఈలోగా మరికొందరు శ్రీనుకు సపోర్ట్‌గా అక్కడకు చేరుకుని సందీప్, మనోజ్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో సందీప్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో వాళ్ళు కూడా ఆ స్థలానికి వచ్చారు.

దీంతో మరింతగా రెచ్చిపోయిన శ్రీను అండ్ గ్యాంగ్ ఇనుప రాళ్లతో దాడికి దిగడంతో వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో టీవీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసే బొబ్బిలి సుదర్శన్, కొరియోగ్రాఫర్ కందుకూరి అనిల్, ఆదిత్య ఉండగా బొబ్బిలి సుదర్శన్ తలకు బలమైన గాయమైంది. మిగిలిన వారికి స్వల్ఫ గాయాలయ్యాయి. జరిగిన ఘటనపై సందీప్ గ్యాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అరుణ్, నర్సింగ్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు