Hyderabad Police Transfers:హైదరాబాద్‌లో భారీగా పోలీసుల బదిలీలు

జంట నగరాల పరిధిలోని 2,865 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేసింది. 2,600 మంది పోలీసు కానిస్టేబుల్స్, 640 మంది హెడ్ కానిస్టేబుల్స్, 219 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad Police

Hyderabad Police Transfers: హైదరాబాద్ మహా నగరంలో పోలీసు శాఖ భారీ బదిలీలు చేపట్టింది. జంట నగరాల పరిధిలోని 2,865 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేసింది. 2,600 మంది పోలీసు కానిస్టేబుల్స్, 640 మంది హెడ్ కానిస్టేబుల్స్, 219 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో ఎప్పుడో జరగాల్సిన బదిలీలు కోవిడ్ కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

5-7 సంవత్సరాలపాటు ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ తాజాగా బదిలీ చేశారు. ఆన్‌లైన్ విధానంలో పోలీసుల బదిలీ ప్రక్రియ నిర్వహించారు. తెలంగాణ పోలీసు శాఖ రూపొందించిన హెచ్ఆర్ఎమ్ఎస్ యాప్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ సాగింది. గురువారం నుంచే ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి.