Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

కొంతకాలంగా వ్యూయర్‌షిప్ పెరగడం లేదని భావించిన హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు ఇంజనీరింగ్ చదువుతూనే లైవ్ గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.

Hyderabad Youtuber Suicide: తన యూట్యూబ్ ఛానెల్‌కు వ్యూయర్స్ పెరగడం లేదని భావించిన ఒక యూట్యూబర్(Youtuber) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్‌ఫ్లో అనే గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న డీనా (24) అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఐదంతస్థుల అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Pushpa2: ఏందిరా సామీ.. ఎక్కడ దొరుకుతాయి మీకు అంటోన్న మనోజ్!

ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రాంతి నగర్ కాలనీలో గురువారం జరిగింది. డీనా ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, సెల్‌ఫ్లో అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ లైవ్ గేమ్స్ ఆడేవాడు. కొంతకాలంగా అతడికి అనుకున్నంతగా వ్యూయర్‌షిప్ పెరగడం లేదు. దీంతో ఆందోళనకు గురైన డీనా తన ఆవేదనను యూట్యూబ్‌లో పంచుకున్నాడు. అనంతరం భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ డీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tirumala: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల తేదీలు

పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు