gummanur jayaram: ఎనీ టైమ్‌.. ఎక్కడైనా, ఎప్పుడైనా చ‌ర్చ‌కు సిద్ధం: ఏపీ మంత్రి గుమ్మ‌నూరు

 టీడీపీ నేతలపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మంత్రిగా మూడు సంవత్సరాల్లో తాను ఏమి చేశాననేదానిపై చ‌ర్చిద్దామ‌ని, ఎనీ టైమ్‌.. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

Jayaram

gummanur jayaram:  టీడీపీ నేతలపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మంత్రిగా మూడు సంవత్సరాల్లో తాను ఏమి చేశాననేదానిపై చ‌ర్చిద్దామ‌ని, ఎనీ టైమ్‌.. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమెకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుంటే మంచిదని ఆయ‌న అన్నారు. తాను 2019లో ఆమెపై దాదాపు 40 వేల ఓట్లతో గెలిచానని గుర్తు చేశారు.

UP Minister: మ‌న దేవుళ్ల వల్లే భార‌త్‌కు ఈ ఘ‌న‌త ద‌క్కింది: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి

సాధార‌ణంగా పురుషుల‌కు పేకాట, తాగుడు అలవాట్లు ఉంటాయ‌ని, అయితే, తన‌కు అలాంటి అలవాట్లు లేవని గుమ్మనూరు జయరాం చెప్పారు. ఆలూరు ప్రజలు సుజాత‌మ్మ‌ను ఆదరించారా? లేక త‌న‌ను ఆదరించారా? అని ఆయ‌న నిల‌దీశారు. తాను బెంజ్‌ కారులో తిరుగుతున్నానంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, బీసీ మంత్రి కారులో తిరగకూడదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పెత్తందారులు మాత్ర‌మే బెంజ్‌ కార్లలో తిరగాలా అని నిల‌దీశారు. అట్టడుగు వర్గాల వారు, బీసీలు వాటిలో తిరగకూడదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

IPL 2022 : Gujarat Titans : ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్‌ను సత్కరించిన సీఎం భూపేంద్రభాయ్

అట్టడుగున ఉన్న ప్రజల కోసం అనేక రకాల పథకాలు అమ‌లు చేసి, వారికి మూడు పూటలా భోజనం పెట్టడం అభివృద్ధి కాదా? అని గుమ్మనూరు జయరాం అడిగారు. త‌న‌ను వెన్నెముకలేని మంత్రి అని అంటున్నారని, త‌న‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని చెప్పారు. తాను ఎలాంటి వైద్య ప‌రీక్ష‌ల‌కు అయినా సిద్ధమ‌ని స‌వాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు బీసీలు గతంలో పూలదండలు వేశారని ఆయన అన్నారు. అయితే, బీసీలపైన దాడులు చేసిన వ్యక్తి బాలకృష్ణ అని ఆయన ఆరోపించారు.

KS Eshwarappa: నో డౌట్.. ఆర్ఎస్ఎస్ జెండా జాతీయ జెండా అవుతుంది: కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ప‌నులు చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. వర్గ రాజకీయాలు, వర్గ పోరు, ఫ్యాక్షన్ తప్ప టీడీపీ నేత‌లు ఏం చేశారని ఆయ‌న నిల‌దీశారు. వ‌చ్చే అసెంబ్లీలో క‌ర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని కోట్ల సుజాతమ్మపై పగటి కలలు కంటున్నారని ఆయ‌న అన్నారు. ఆలూరు అభివృద్ధి గురించి టీడీపీ చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయని ఆయ‌న చెప్పారు. ‘‘మీ మామ కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి, మీ ఆయన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కేంద్ర మాజీ రైల్వే సహాయ మంత్రి. మీరు ఆలూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారు?’’ అని ఆయ‌న అన్నారు. మంత్రిగా తాను ఏమి చేశాననేదానిపై చ‌ర్చిద్దామ‌ని అన్నారు. అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

K Lakshman: యూపీ నుంచి రాజ్యసభ బరిలోకి కే.లక్ష్మణ్

అలాగే, హిందూపురంలో అభివృద్ధి ప‌నులు చేయ‌ని బాలకృష్ణను కొడతారో లేదా త‌న‌ను కొడతారో ప్రజలని అడిగితే వారే చెబుతార‌ని ఆయ‌న అన్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. జగనన్న, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలు త‌న‌ వెనకే ఉన్నారని, తాను మూడోసారి కూడా విజయం సాధిస్తాన‌ని అన్నారు. జగనన్న‌ను ముఖ్యమంత్రిని చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. 2024లో కూడా జగనన్నే ముఖ్యమంత్రి అని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అభివృద్ధి అంటే ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టడడ‌మేన‌ని, అంతేగానీ, ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించడం కాదని ఆయ‌న అన్నారు. త‌మ‌ ప్రభుత్వంలో నవరత్నాలతో సుఖశాంతులతో ప్రజలు హాయిగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.