UP Minister: మన దేవుళ్ల వల్లే భారత్‌కు ఈ ఘనత దక్కింది: ఉత్తరప్రదేశ్ మంత్రి
అయోధ్య, మథుర అంశాలపై ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Narayana Ch
UP Minister: అయోధ్య, మథుర అంశాలపై ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ”భారత్ ఓ గ్లోబల్ పవర్‌హౌస్ (విశ్వగురువు), మన దేవుళ్ల వల్లే ఈ ఘనత దక్కింది. అయోధ్య రాముడి జన్మస్థలం. మథుర కృష్ణుడి జన్మస్థలం. కాశీని శివుడే సృష్టించాడు. మన దేవుళ్లే మన గుర్తింపు. అర్జునుడికి కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఇప్పుడు ప్రపంచం మొత్తం చదువుతోంది” అని అన్నారు.
KS Eshwarappa: నో డౌట్.. ఆర్ఎస్ఎస్ జెండా జాతీయ జెండా అవుతుంది: కేఎస్ ఈశ్వరప్ప
”ఆదర్శమూర్తి అయిన ఓ తండ్రి, ఓ భర్త, సోదరుడు, స్నేహితుడు ఎలా ఉంటాడన్న సందేశాన్ని రాముడి జీవితం ద్వారా ప్రపంచం మొత్తం పొందుతోంది” అని లక్ష్మీ నారాయణ చౌదరి వ్యాఖ్యానించారు. కృష్ణుడి జన్మస్థలం మథురలో సర్వే నిర్వహించే అవకాశం లేదని చెప్పారు. వారణాసీలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని సాహీ ఈద్గా కేసుపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని, ఆయా అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయని ఆయన అన్నారు.