Pawan kalyan: పార్టీ పెడతానని నేను అనుకోలేదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్

పార్టీ పెడతానని తాను అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తు చేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ఖలిస్థాన్, జిహాదీ ఉద్యమాలు చూస్తే భయమేస్తోందని చెప్పారు. బాధ్యతాయుత పౌరుడిగా సమాజంలో మెలగాలని సూచించారు.

Pawan kalyan: పార్టీ పెడతానని తాను అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తు చేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సమాజానికి మంచి చేయాలని పార్టీని పెట్టానని చెప్పారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ఖలిస్థాన్, జిహాదీ ఉద్యమాలు చూస్తే భయమేస్తోందని చెప్పారు. బాధ్యతాయుత పౌరుడిగా సమాజంలో మెలగాలని సూచించారు.

ఐటీని ఏపీలో ఎందుకు అభివృద్ధి చేయరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. యువత ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఎందుకు ఉందని ఆయన నిలదీశారు. జనసేన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీలో ఐటీ సంస్థలు స్థాపించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. మనసు పెట్టి చేయాలని అనుకుంటే చేయొచ్చని తెలిపారు.

కానీ, రాష్ట్రంలో ఇటువంటి పనులు చేయట్లేదని అన్నారు. సంక్షేమ పథకాల పేరిట మభ్యపెడుతున్నారని, రాష్ట్ర ఆదాయం కన్నా అధికంగా ఖర్చుపెడుతున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. దీన్ని అభివృద్ధి అంటారా? అనేది మీరే ఆలోచించాలని ఆయన ప్రజలకు చెప్పారు.

China-Taiwan conflict: తైవాన్‌కు మొన్న నాన్సీ ఫెలోసీ.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం 

ట్రెండింగ్ వార్తలు