China-Taiwan conflict: తైవాన్‌కు మొన్న నాన్సీ ఫెలోసీ.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం 

అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ తైవాన్ లో అడుగుపెట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నాన్సీ ఫెలోసీ పర్యటించి కొన్ని రోజులు కూడా గడవకముందే అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం మళ్ళీ తైవాన్ లో పర్యటిస్తుండడం గమనార్హం.

China-Taiwan conflict: తైవాన్‌కు మొన్న నాన్సీ ఫెలోసీ.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం 

China Us

Updated On : August 14, 2022 / 6:20 PM IST

China-Taiwan conflict: అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం ఇవాళ తైవాన్ లో అడుగుపెట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నాన్సీ ఫెలోసీ పర్యటించి కొన్ని రోజులు కూడా గడవకముందే అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం మళ్ళీ తైవాన్ లో పర్యటిస్తుండడం గమనార్హం. సెనేటర్ ఈడీ మార్కే, ప్రతినిధులు జాన్ గరమెండీ, అలన్ లోవెన్తల్, డాన్ బెయర్, అనుమువా అమట కొలెమన్ రడెవాగెన్ ఇవాళ, రేపు తైవాన్ లో పర్యటిస్తారు.

కాగా, ప్రస్తుతం చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శాంతి, స్థిరత్వం కొనసాగేలా కృషి చేయాలని ఇప్పటికే చైనాకు అమెరికా సూచించింది. తైవాన్ లో నాన్సీ ఫెలోసీ పర్యటన అనంతరం చైనా పాల్పడుతున్న చర్యలు సరికాదని చెప్పింది. అయితే, చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు ముగిసినప్పటికీ, యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయని డ్రాగన్ దేశం స్పష్టం చేసింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉండడంతో తైవాన్ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ సమయంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందం తైవాన్ లో పర్యటిస్తుండడం గమనార్హం.

Dalit boy beaten to death: నీరు తాగడానికి కుండను ముట్టుకున్న దళిత బాలుడు.. కొట్టి చంపిన టీచర్