Heart
Dextrocardia : ప్రతిమనిషికి శరీరంలోని అవయవాలు ఉండాల్సిన స్ధానాల్లో ఉండకపోతే ఏదో లోపంగా భావిస్తాం.. శరీరంలోని పైబాగంలో కళ్ళకు కనిపించే ప్రాంతమైతే పర్వాలేదు లోపాన్ని గుర్తించటం ఈజీగానే ఉంటుంది. అదే మనిషి బాడీలోని అంతర్భాగంలోని అవయవాల లోపాన్ని గుర్తించటం అంతతేలికైనది కాదు. ఏదో జబ్బుపడి ఆసుపత్రికి వెళ్ళి స్కానింగ్ వంటివి చేస్తే కాని అసలు విషయం తెలిసేది. ఇప్పుడు అలాంటి వింత అనుభూతే ఎదురైంది అమెరికాకు చెందిన ఓ మహిళకు… వివరాల్లోకి వెళితే…
అమెరాకాలోని చికాగోకు చెందిన క్లెయిర్ మాక్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతుంది. దగ్గు తగ్గించుకునేందుకు అనేక టాట్లెట్లు, సిరప్ లు వాడుతున్నా ఏమాత్రం ఫలితంలేదు. రెండు నెలలు గడుస్తున్నా దగ్గు తగ్గకపోవటంతో ఆసుపత్రికి వెళ్ళింది. దగ్గు తగ్గకపోవటానికి ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉండి ఉండవచ్చేమొనన్న అనుమానంతో ఎక్సరే తీయించాడు. తీరా ఎక్సరేను పరిశీలించిన వైద్యుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. క్లెయిర్ శరీరంలో ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్లు గుర్తించాడు.
ఇదే విషయాన్ని వైద్యుడు క్లెయిర్ కు తెలియజేశాడు. దగ్గు సమస్యకు, గుండె కుడివైపు ఉండటానికి ఎలాంటి సంబంధంలేదని దీనికి భయపడాల్సిన పనిలేదని క్లెయిర్ కు వైద్యుడు ధైర్యం చెప్పాడు. ప్రపంచంలో ఒక శాతం మంది కుడివైపు గుండెతో జన్మిస్తారని వైద్యులు చెబుతున్నారు. కుడివైపు గుండె ఉండటాన్ని డెక్స్ ట్రాకార్డియా అంటారు.
శరీరంలో కుడివైపు గుండె ఉన్న విషయం 19ఏళ్ళుగా క్లెయిమ్ గుర్తించలేకపోయింది. ఇంతకాలం ఎలాంటి సమస్య లేకుండానే పూర్తి స్ధాయి ఆరోగ్యంతో గడిపింది. తనకు అందరిలా కాకుండా కుడివైపు గుండె ఉందని వైద్యులు చెప్పటంతో ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా అందరితో పంచుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఆసక్తికర అంశంగా మారింది.