Independence Day 2022 WhatsApp stickers _ How to send Stickers and wish your friends, All You Need Know
Independence Day 2022 : ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం 2022 (ఆగస్టు 15). భారత దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఘనంగా జెండా వందన వేడుకలను జరుపుకుంటున్నారు. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ వేదికగా (Independence Day 2022) విషెస్ చెప్పుకోవచ్చు. WhatsAppలో మీ స్నేహితులకు శుభాకాంక్షలు పంపడానికి యానిమేటెడ్ లేదా సాధారణ స్టిక్కర్ ప్యాక్ కోసం తెగ వెతికేస్తున్నారా? అయితే గూగుల్ Play Storeలో అనేక థర్డ్-పార్టీ స్టిక్కర్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు.. మీరు “Sticker.ly” యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని యాప్‌లలో బెస్ట్ ఇండిపెండెన్స్ డే స్టిక్కర్‌లు, కొన్ని యానిమేటెడ్ స్టిక్కర్‌లు ఉన్నాయి. మరో విషయం ఏమింటంటే.. ఈ యాప్ యాడ్-ఫ్రీ కాదని గుర్తుంచుకోండి. ఏదైనా ఓపెన్ చేసిన తర్వాత ప్రతి 10 సెకన్లకు మీకు యాడ్స్ వస్తుంటాయి. అనేక థర్డ్-పార్టీ యాప్‌లకు సంబంధించినది. ఉదాహరణకు.. WhatsAppకి కొత్త స్టిక్కర్ ప్యాక్ యాడ్ చేసిన తర్వాత మీకు ప్రకటనలు కనిపించవచ్చు. ఈ యాప్‌లో వేలాది ఇతర స్టిక్కర్‌లు ఉన్నాయి. అందులో మీకు నచ్చినవి పంపుకోవచ్చు. ఆగస్ట్ 15, 2022న స్వాతంత్ర్య దినోత్సవం 2022 WhatsApp స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
– Google Play Storeకి వెళ్లండి.. అందులో “Sticker.ly” యాప్ కోసం సెర్చ్ చేయండి.
– మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీకు స్క్రీన్ పైభాగంలో స్వాతంత్ర్య దినోత్సవ స్టిక్కర్ ప్యాక్‌లు కనిపిస్తాయి.
– అన్ని స్టిక్కర్‌లను చూడాలంటే.. మీరు ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌పై Tap చేయవచ్చు.
– మీరు స్టిక్కర్ ప్యాక్ సెలక్ట్ చేసిన తర్వాత.. వాట్సాప్‌కు Add బటన్ Tap చేయాలి.
– మెయిన్ స్క్రీన్‌లోని ప్రతి స్టిక్కర్ ప్యాక్‌కి కుడి వైపున “Add” బటన్ ఉంటుంది.
– యాప్ వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ Tap చేయాలి. మళ్లీ “ADD” బటన్‌పై నొక్కండి.
– అప్పుడు WhatsApp స్టిక్కర్ సెక్షన్‌లోని స్టిక్కర్ ప్యాక్ చూడవచ్చు.
Independence Day 2022 WhatsApp stickers _ How to send Stickers and wish your friends, All You Need Know
WhatsApp యానిమేషన్ స్టిక్కర్ల కోసం ఒక సెక్షన్ అందిస్తుంది. మీరు స్టిక్కర్లు, GIFలు, స్టిక్కర్లను పొందవచ్చు. యానిమేటెడ్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను పంపవచ్చు. ఏదైనా కాంటాక్ట్ చాట్‌ని ఓపెన్ చేయండి. స్క్రీన్ దిగువ ఎడమ వైపున (Search Bar) ఉన్న ఎమోజి ఐకాన్‌పై Tap చేయండి. మీకు GIF సెక్షన్ కనిపిస్తుంది. దానిపై Tap చేయాలి. ఎడమ వైపున, మీరు Search బటన్‌ను Tap చేయాలి. అక్కడే మీరు Independence Day అని టైప్ చేయండి. ఆ తర్వాత భారతీయ జెండాతో కూడిన యానిమేటెడ్ స్వాతంత్ర్య దినోత్సవ స్టిక్కర్ల గ్రూపును పొందవచ్చు. అందులో మీకు నచ్చిన Stickers సెలక్ట్ చేసుకుని Send బటన్‌పై Tap చేయండి.