Independence Day 2022: ఎర్రకోటపై ఎంత మంది ప్రధానులు, ఎన్నెన్ని సార్లు జాతీయ జెండా ఎగురవేశారో తెలుసా? ఆ ఇద్దరికి దక్కని అవకాశం..

76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.

Independence Day 2022: ఎర్రకోటపై ఎంత మంది ప్రధానులు, ఎన్నెన్ని సార్లు జాతీయ జెండా ఎగురవేశారో తెలుసా? ఆ ఇద్దరికి దక్కని అవకాశం..
ad

Independence Day 2022: 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయడం మోదీకి ఇది తొమ్మిదో సారి. అత్యధికంగా జవహర్ లాల్‌నెహ్రూ 17సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి ఎక్కువ సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానిగా మొదటి స్థానంలో నిలిచారు.

Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

75సంవత్సరాల స్వతంత్ర్య భారతదేశంలో 13మంది ప్రధానులు ఎర్రకోటపై పంద్రాగస్టు వేడుకలకు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే మరో ఇద్దరు ప్రధానులకు ఈ అవకాశం లభించలేదు. వీరిలో గుల్జారీలాల్ నందా, చంద్రశేఖర్‌లు ఉన్నారు. అయితే అత్యధికంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానుల్లో జవహర్ లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 17సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. తరువాతి స్థానంలో ఇందిరా గాంధీ ఉన్నారు. ఆమె 16సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తరువాత మన్మోహన్ సింగ్ 10సార్లు, ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిసార్లు, హటల్ బీహారి వాజ్‌పేయి ఆరు సార్లు ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు.

Independence Day 2022: పిన్‌కోడ్‌కు నేటితో యాభై ఏళ్లు.. ఎలా మొదలైందో తెలుసా?

రాజీవ్ గాంధీ ఐదు సార్లు, పి.వి. నర్సింహారావు ఐదు సార్లు, మొరార్జీ దేశాయి రెండు సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి రెండు సార్లు, చరణ్ సింగ్, వి.పి. సింగ్, హెచ్‌డి దేవగౌడ, కె. గుజరాల్‌లు ఒక్కోసారి ఎర్రకోట‌లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా‌ను ఆవిష్కరించారు.