Independence Day 2022: పిన్‌కోడ్‌కు నేటితో యాభై ఏళ్లు.. ఎలా మొదలైందో తెలుసా?

పోస్టల్ సర్వీసుల కోసం మొదలైన పిన్‌కోడ్‌ ఏర్పడి నేటితో యాభై ఏళ్లు పూర్తయ్యాయి. భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. దేశంలో గుర్తు చేసుకోవాల్సిన మరో విశేషమిది. పిన్‌కోడ్‌‌కు ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్.

Independence Day 2022: పిన్‌కోడ్‌కు నేటితో యాభై ఏళ్లు.. ఎలా మొదలైందో తెలుసా?
ad

Independence Day 2022: భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. దేశంలో గుర్తు చేసుకోవాల్సిన మరో విశేషముంది. అదే పోస్టల్ పిన్‌కోడ్‌ ఏర్పడి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది పిన్‌కోడ్‌ గోల్డెన్ జూబ్లీ ఇయర్ కావడం విశేషం. పోస్టల్ ఇండెక్స్ నెంబర్‌‌ను సంక్షిప్తంగా పిన్ అంటారు. పోస్టల్ సర్వీసు లేదా కొరియర్ ద్వారా డాక్యుమెంట్స్, గూడ్స్ వంటివి ఏవి పంపాలన్నా పిన్‌కోడ్‌ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే.

Delhi: బాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దోపిడీ.. ముంబై పోలీసులమని చెప్పుకొని ఢిల్లీలో మోసం

ఈ పిన్‌కోడ్‌ ప్రారంభమైంది ఆగష్టు 15, 1972న. ఇది ఆరు అంకెల సంఖ్య. వీటిని ఏరియా కోడ్ లేదా జిప్ అని కూడా అంటారు. పిన్‌కోడ్‌ ప్రవేశపెట్టడానికి కారణముంది. దేశంలోని అనేక ప్రాంతాల పేర్లు, ఊళ్ల పేర్లు ఒకేలా ఉండటమే ఇందుకు కారణం. దీంతో చాలా వాటి చిరునామాలు తారుమారు అవుతుండేవి. అలాగే దేశంలో అనేక భాషలున్నాయి. అందువల్ల చాలా మంది స్థానిక భాషల్లో చిరునామాలు రాసేవారు. అవి వేరే ప్రాంతం వాళ్లకు అర్థమయ్యేవి కావు. దీంతో ఒక చోటుకు చేరాల్సిన ఉత్తరాలు మరో చోటుకు చేరేవి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిందే పిన్‌కోడ్‌. అప్పట్లో కేంద్ర సమాచార శాఖలో సెక్రటరీగా ఉన్న శ్రీరామ్ భికాజి వేలంకార్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఊళ్లు, ప్రాంతాల పేర్లు అర్థం కాకపోయినా, అడ్రస్‌లో ఉన్న భాష తెలియకపోయినా.. సులభంగా గుర్తుపట్టాలంటే నెంబరింగ్ సిస్టమే మంచిదని నిర్ణయించారు.

Army Dog: తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు వదిలిన ఆర్మీ శునకం.. అవార్డు ప్రకటించిన ప్రభుత్వం

దీంతో పిన్‌కోడ్‌ అమల్లోకొచ్చింది. ఇందులో మొదటి అంకె జోన్.. రెండో అంకె సబ్ జోన్.. మూడో అంకె… మొదటి రెండు అంకెలతో కలిపి ఉండే జిల్లాకు చెందిన జోన్. చివరి మూడు అంకెలు ఆ జోన్ పరిధిలో కేటాయించిన పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించిన సంఖ్యను సూచిస్తాయి. సాధారణంగా జిల్లా ప్రధాన కార్యాలయాన్ని పోస్టల్ రీజన్‌గా గుర్తిస్తారు. దేశంలో ప్రస్తుతం 23 పోస్టల్ సర్కిళ్లు ఉన్నాయి.