Army Dog: తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు వదిలిన ఆర్మీ శునకం.. అవార్డు ప్రకటించిన ప్రభుత్వం

తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు విడిచిందో శునకం. పేరు యాక్సెల్. గత నెల తీవ్రవాదికి, సైన్యానికి మధ్య జరిపిన కాల్పుల్లో యాక్సెల్ వీర మరణం పొందింది. యాక్సెల్ త్యాగాన్ని కేంద్రం గుర్తించింది.

Army Dog: తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు వదిలిన ఆర్మీ శునకం.. అవార్డు ప్రకటించిన ప్రభుత్వం

Army Dog: సైన్యంలో శునకాలు కూడా సేవలందిస్తాయి. తీవ్రవాదుల్ని, పేలుడు పదార్థాల్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి. అలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శునకాలను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. వీర మరణం పొందిన సైనికులతోపాటు, వాటికి కూడా గ్యాలంట్రీ అవార్డులు అందిస్తుంది కేంద్రం.

Independence Day Celebrations: వజ్రోత్సవ వేడుకకు సిద్ధమైన గోల్కొండ.. జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్ ..

తాజాగా ‘యాక్సెల్’ అనే శునకానికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డు ప్రకటించింది. ఈ శునకం ఇటీవలే వీర మరణం పొందింది. గత నెలలోనే ఈ శునకం ప్రాణాలు కోల్పోయింది. రెండేళ్ల వయసున్న యాక్సెల్‌కు సైన్యం అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చింది. పేలుడు పదార్థాల్ని గుర్తించడం, తీవ్రవాదుల కదలికల్ని గుర్తించడం, వారిపై దాడులు చేయడం వంటివి ఈ శునకాలు చేస్తుంటాయి. ఆర్మీ నిర్వహించే ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా అనేక సైనిక శునకాలు సేవలందిస్తున్నాయి. కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయాయి. గత నెల 30న జమ్ము-కాశ్మీర్.. బారాముల్లా జిల్లాలో ఇండియన్ ఆర్మీ ఒక యాంటీ-టెర్రర్ ఆపరేషన్ నిర్వహించింది. తీవ్రవాదుల్ని పట్టుకునేందుకు ఆర్మీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా సైనికులకు, తీవ్రవాదికి మధ్య కాల్పులు జరిగాయి.

India Ban On VLC Media Player : వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌‌పై నిషేధం విధించిన భారత్..! కారణం ఏంటంటే..

టెర్రరిస్టుల్నిని ఎదుర్కోవడంలో సైన్యానికి, యాక్సెల్ కూడా సహకరించింది. ఈ క్రమంలో తీవ్రవాది జరిపిన కాల్పుల్లో యాక్సెల్ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తీవ్రవాదిని సైన్యం కాల్చి చంపింది. యాక్సెల్‌కు సైన్యం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. తాజాగా కేంద్రం ప్రకటించిన గ్యాలంట్రీ అవార్డు జాబితాలో యాక్సెల్‌కు చోటు దక్కింది. తాజాగా 107 గ్యాలంట్రీ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.