India Ban On VLC Media Player : వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌‌పై నిషేధం విధించిన భారత్..! కారణం ఏంటంటే..

పాపులర్ మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ VLC మీడియా ప్లేయర్‌ పై భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తోంది. వీడియోలాన్ ప్రాజెక్ట్ VLC మీడియా ప్లేయర్, వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఐటీ యాక్ట్ 2000 ప్రకారం బ్యాన్ చేసింది. VLC మీడియా ప్లేయర్, దాని వెబ్‌సైట్ సేవలు ఇప్పటికే రెండు నెలలుగా నిలిపేశారు.

India Ban On VLC Media Player : వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌‌పై నిషేధం విధించిన భారత్..! కారణం ఏంటంటే..

India Ban On VLC Media Player : పాపులర్ మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ VLC మీడియా ప్లేయర్‌ పై భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తోంది. వీడియోలాన్ ప్రాజెక్ట్ VLC మీడియా ప్లేయర్, వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఐటీ యాక్ట్ 2000 ప్రకారం బ్యాన్ చేసింది. VLC మీడియా ప్లేయర్, దాని వెబ్‌సైట్ సేవలు ఇప్పటికే రెండు నెలలుగా నిలిపేశారు. VLC మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే ఐటీ యాక్ట్ కింద నిషేధించినట్లు మేసేజ్ దర్శనం ఇస్తోంది. కాగా, బ్యాన్ విషయానికి సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.

VLC మీడియా ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌లపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు VLC మీడియా ప్లేయర్‌ను ఉపయోగించుకుంటోందని, ఈ కారణంతోనే ఐటీ యాక్ట్-2000 ప్రకారం భారత ప్రభుత్వం VLC ప్లేయర్‌ను బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం బ్యాన్ విధించడంతో ఇకపై వీఎల్సీ మీడియా ప్లేయర్ ఇన్‌స్టలేషన్ కోసం వినియోగదారులు మీడియా ప్లేయర్‌ని డౌన్‌లోడ్ చేయలేరు. అధికారిక VLC మీడియా ప్లేయర్ వెబ్‌సైట్‌కు యాక్సెస్‌ను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు నివేదించబడింది. తమ పరికరంలో ఇప్పటికే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు మాత్రం దానిని ఉపయోగించడం కొనసాగించవచ్చు. కాగా, వీఎల్ సీ మీడియా ప్లేయర్ బ్యాన్ కు సంబంధించి అటు కంపెనీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

 

VLC మీడియా ప్లేయర్ పై భారత్ బ్యాన్..