Delhi: బాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దోపిడీ.. ముంబై పోలీసులమని చెప్పుకొని ఢిల్లీలో మోసం

బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26 (తెలుగులో సూర్య హీరోగా వచ్చిన గ్యాంగ్)’ స్ఫూర్తితో ఢిల్లీలో దోపిడీకి పాల్పడిందో ముఠా. ముంబై పోలీసులమని చెప్పుకొని దాదాపు ఏడు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.

Delhi: బాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దోపిడీ.. ముంబై పోలీసులమని చెప్పుకొని ఢిల్లీలో మోసం

Delhi: బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ మూవీ స్ఫూర్తితో దోపిడీకి పాల్పడిందో ముఠా. ముంబై పోలీసులుగా చెప్పుకొంటూ, ఢిల్లీలోని ఒక వెల్‌నెస్ సెంటర్ నుంచి దాదాపు ఏడు లక్షల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం ఐదుగురు వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది.

Army Dog: తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు వదిలిన ఆర్మీ శునకం.. అవార్డు ప్రకటించిన ప్రభుత్వం

స్థానిక నేతాజీ సుభాష్ ప్లేస్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఒక వెల్‌నెస్ సెంటర్‍‌లోకి ఐదుగురు ఎంటరయ్యారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. వీరు తాము ముంబై పోలీసు అధికారులమని చెప్పుకొన్నారు. తర్వాత వెల్‌నెస్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ వెల్‌నెస్ సెంటర్‌ నిర్వాహకుడిని బెదిరించి, అతడి భార్య ద్వారా ఐదు లక్షల రూపాయలు తీసుకురమ్మన్నారు. వెంటనే అతడి భార్య డబ్బు తీసుకొచ్చింది. ఆ డబ్బుతోపాటు అక్కడున్న ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, బ్యాంకు డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లిపోయారు. వెల్‌నెస్ సెంటర్‌ లోపల పోలీసులుగా చెప్పుకున్న వాళ్లు ఉంటే, బయట మరో ముగ్గురు గార్డులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన తర్వాత బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

Independence Day Celebrations: న్యూ ఇండియా సాకారంకోసం కృషిచేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుంది.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు మధ్యప్రదేశ్, ఢిల్లీ, హరియాణాకు చెందిన వాళ్లుగా గుర్తించారు.