Independence Day Celebrations: న్యూ ఇండియా సాకారంకోసం కృషిచేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుంది.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై ఆయన 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Independence Day Celebrations: న్యూ ఇండియా సాకారంకోసం కృషిచేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుంది.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Modi

Updated On : August 15, 2022 / 8:30 AM IST

Independence Day Celebrations: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై ఆయన 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం నవ సంకల్పంతో ముందుకెళ్తోందని అన్నారు. న్యూ ఇండియా సాకారం కోసం కృషిచేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుందని తెలిపారు. త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని, ఎంతోమంది మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మార్గదర్శకులని చెప్పారు.

Independence Day Celebrations: వజ్రోత్సవ వేడుకకు సిద్ధమైన గోల్కొండ.. జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్ ..

ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు భారత్ కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా మన జాతీయ జెండా రెపరెపలాడిందని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వీరులు ప్రాణత్యాగం చేశారని, దేశంకోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు మాతృభూమి కోసమే జీవించారని, నారాయణ గురు నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారని, గిరిజనులు ఈ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. ఎంతో మంది మహనీయులకు ఈ దేశం జన్మనివ్వడం మన అదృష్టం అని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదని, స్వాంతంత్ర్య సమరయోధులు బ్రిటీష్ వ్యవస్థ మూలాలను కదిలించారని అన్నారు. పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కు మోదీ సెల్యూట్ చేశారు.

Independence Day Celebrations: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇలా..

భిన్నత్వంలో ఏకత్వం దేశానికి బలమన్న మోదీ.. దేశం మొత్తం సమిష్టిగా కరోనాను తరిమికొట్టిందని అన్నారు. ప్రంపచమంతా భారత్ వైపు చూసేలా మనం ఎదిగామని,
యావత్ ప్రపంచం భారత్ గురించి మాట్లాడుకుంటోందని తెలిపారు. దేశ ప్రజలు సానుకూలమైన మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు కోసం ప్రతీఒక్కరూ కృషి చేస్తున్నారని, న్యూ ఇండియా సాకారంకోసం కృషి చేస్తున్న ప్రతీ భారతీయుడికి ఈ దేశం సెల్యూట్ చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.