DRDO and Indian Army: లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ విజయవంతంగా ప్రయోగించిన భారత్

భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. భారత్ సొంతంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ఏటీజీఎమ్)ను డీఆర్‌డీఓ, ఇండియన్ ఆర్మీ విజయవంతంగా ప్రయోగించాయి.

DRDO and Indian Army: భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. భారత్ సొంతంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ (ఏటీజీఎమ్)ను విజయవంతంగా ప్రయోగించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో ఉన్న కేకే రేంజ్ నుంచి డీఆర్‌డీఓ, ఇండియన్ ఆర్మీ ఈ ప్రయోగాన్ని గురువారం చేపట్టాయి. మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంబీటీ) అర్జున్ నుంచి వీటిని ప్రయోగించారు.

WhatsApp Group Admin: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎవరి మెసేజ్‌నైనా అడ్మిన్ డిలీట్ చేసే అవకాశం

రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వేర్వేరు నిర్దేశిత లక్ష్యాల్ని ఇవి కచ్చితత్వంతో చేధించాయని అధికారులు తెలిపారు. ఏటీజీఎమ్‌లు హై ఎక్స్‌ప్లోజివ్ యాంటీ ట్యాంక్ (హీట్) వార్ హెడ్లను మోసుకుపోగలవు. ఆయుధాలతో కూడిన వాహనాలను ధ్వంసం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఏటీజీఎమ్‌లను మల్టీ లాంచ్ ప్లాట్‌ఫామ్ క్యాపబిలిటీతో ఎక్కడినుంచైనా ప్రయోగించగలిగేలా రూపొందించారు. తాజా పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇండియన్ ఆర్మీతోపాటు, డీఆర్‌డీఓను అభినందించారు.

 

ట్రెండింగ్ వార్తలు