WhatsApp Group Admin: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎవరి మెసేజ్‌నైనా అడ్మిన్ డిలీట్ చేసే అవకాశం

వాట్సాప్‌లో అభ్యంతరకర, తప్పుడు మెసేజులు వస్తే ఇకపై అడ్మిన్లే వాటిని డిలీట్ చేయొచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందబాటులోకి రానుంది. దీని ద్వారా గ్రూపులో అనవసర మెసేజులకు తావుండదు.

WhatsApp Group Admin: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎవరి మెసేజ్‌నైనా అడ్మిన్ డిలీట్ చేసే అవకాశం

Updated On : August 4, 2022 / 9:13 PM IST

WhatsApp Group Admin: వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. గ్రూపులోని ఎవరి మెసేజ్‌నైనా ఇకపై అడ్మిన్లు డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌ ద్వారా, వాట్సాప్ 2.22.17 అప్‌డేట్‌తో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Abhilipsa Wins Hearts: అభిలిప్స పాటకు నెటిజన్ల ఫిదా.. ‘హరహర శివ శంభు’కు మిలియన్ల వ్యూస్

వాట్సాప్‌లో చాలా మంది అభ్యంతరకర మెసేజ్‌లు పోస్ట్ చేస్తుంటారు. మన దేశ నిబంధనల ప్రకారం ఏదైనా గ్రూపులో అభ్యంతరకర మెసేజ్ వస్తే దానికి పోస్ట్ చేసిన వ్యక్తే కాకుండా.. అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, అలాంటి మెసేజులను నియంత్రించే అధికారం గ్రూపు అడ్మిన్లకు ఇప్పటివరకు లేదు. కానీ, ఇకపై అడ్మిన్లకు ఈ అవకాశం కలుగుతుంది. తప్పుగా అనిపించిన, అభ్యంతరకర, అసత్య ప్రచారాలతో కూడిన మెసేజులను గ్రూపు అడ్మిన్ తొలగించవచ్చు. అది కూడా పోస్ట్ చేసిన వారి అనుమతి లేకుండానే డిలీట్ చేయొచ్చు. ఒకసారి డిలీట్ చేస్తే గ్రూపులో ఎవరికీ ఆ మెసేజ్ కనిపించదు. కానీ, మెసేజ్ డిలీట్ చేసిన విషయం మాత్రం గ్రూపులో కనిపిస్తుంది.

Man Caught Brother: పై నుంచి జారిపడ్డ తమ్ముడు.. క్యాచ్ పట్టి రక్షించిన అన్న… వీడియో వైరల్

ఇప్పటికే మన దేశంలో వాట్సాప్‌పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై అసత్య ప్రచారం ఎక్కువగా జరుగుతోందని దీనిపై ఫిర్యాదు ఉంది. అందుకే నిబంధనలు ఉల్లంఘించిన వారి అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేస్తోంది. గత మే నెలలో 19 లక్షల అకౌంట్లను, జూన్‌లో 22 లక్షల అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది. వాట్సాప్‌లో అభ్యంతరకర మెసేజులపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.