Abhilipsa Wins Hearts: అభిలిప్స పాటకు నెటిజన్ల ఫిదా.. ‘హరహర శివ శంభు’కు మిలియన్ల వ్యూస్

ఒక్క పాటతో సెన్సెషన్ క్రియేట్ చేసింది యవు సింగర్ అభిలిప్సా పాండా. ‘హరహర శివ శంభు’ అనే భక్తి పాటతో శ్రోతల మనసు దోచేసింది. అభిలిప్స పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

Abhilipsa Wins Hearts: అభిలిప్స పాటకు నెటిజన్ల ఫిదా.. ‘హరహర శివ శంభు’కు మిలియన్ల వ్యూస్

Abhilipsa Wins Hearts: ఈ మధ్య యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారిన సాంగ్ ‘హరహర శివ శంభు’. ఈ భక్తిపాటకు వ్యూయర్స్ ఫిదా అవుతున్నారు. వెస్టర్న్ మ్యూజిక్ వినేవాళ్లకు కూడా నచ్చేలా ఈ భక్తి పాట రూపొందింది. సింగర్ జీతూ శర్మతో కలిసి అభిలిప్స అనే అమ్మాయి పాడిన ఈ పాటకు మూడు నెలల్లోనే దాదాపు 73 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

Man Caught Brother: పై నుంచి జారిపడ్డ తమ్ముడు.. క్యాచ్ పట్టి రక్షించిన అన్న… వీడియో వైరల్

భక్తి పారవశ్యంలో మునిగి తేలేవారికే కాకుండా.. సాధారణ శ్రోతలకు కూడా ఈ పాట బాగా నచ్చింది. ఈ పాటలో అందరికంటే ఎక్కువగా ఆకట్టుకుంది యువ సింగర్ అభిలిప్సా పాండా. ఆమె గాత్రానికి శ్రోతలు మైమరచి పోతున్నారు. ఆమె గాత్రం కొత్తగా అనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క పాటతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అభిలిప్సకు ఇంతగా గుర్తింపు తెచ్చిన ఈ పాటను రూపొందించింది జీతూ. శివ స్తోత్రం ఆధారంగా జీతూ శర్మ ఈ పాటను రూపొందించాలనుకున్నారు. అయితే, అందరికీ తెలిసిన గాయనితో కాకుండా.. ఒక కొత్త సింగర్‌తో ఈ పాట పాడించాలనుకున్నారు. అప్పుడు చాలా మంది పేర్లు పరిశీలించగా, ఒడిశాకు చెందిన అభిలిప్స పాండా గురించి తెలిసింది. అంతకుముందే పలు పాటలు పాడిన ఆమె గాత్రాన్ని పరిశీలించి ఈ పాటకు ఎంపిక చేసుకున్నారు.

5G Services In India: అక్టోబర్ నుంచి 5జీ సేవలు.. అందుబాటులోనే ఛార్జీలు: టెలికాం మంత్రి అశ్విని

జీతూ శర్మ అనుకున్నట్లుగానే అభిలిప్స ఈ పాట అద్భుతంగా పాడింది. తన గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒడిశాలోని దియోఘర్ జిల్లా, టెంటాలాబహాల్ గ్రామానికి చెందిన అశోక్ పాండా కూతురు అభిలిప్స. ఇటీవలే ప్లస్ టూ పూర్తి చేసింది. ఒక వైపు చదువుకుంటూనే.. మరోవైపు సింగర్‌గానూ రాణిస్తోంది. నేటి తరానికి స్తోత్రాలు చేరువ కావాలనే ఉద్దేశంతోనే ‘హరహర శివ శంభు’ పాటను రూపొందించినట్లు అభిలిప్స తెలిపింది. తనకు గాయనిగా మరిన్ని అవకాశాలు వస్తే ప్రతిభ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంది.