Ajit Agarkar
India vs England: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో మొదట్లో బాగా రాణించిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైంది. భారత జట్టు గెలుపు ఖాయమని మొన్నటి వరకు భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది బుమ్రా సేన. ఇంగ్లండ్ 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ 2-2తో సమం అయింది. ఐదో టెస్టులో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ స్పందించారు. ఇటువంటి ఓటమి టీమిండియాను షాక్‌కు గురి చేస్తుందని చెప్పారు.
Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన
ధాటిగా ఆడిన రూట్, బెయిర్‌స్టోను ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో చక్కగా ఆడే ఇద్దరు ఆటగాళ్ళు క్రీజులో ఉన్న సమయంలో ఇటువంటి ఫలితాలు రావడం సాధారణమేనని అన్నారు. అయితే, ఇంత ఘోరంగా టీమిండియా ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ జట్టుకు గట్టిపోటీ ఇస్తే బాగుండేదని చెప్పారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో రూట్ 142 పరుగులు చేయగా, బెయిర్‌స్టో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.