Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన

ఐఎమ్‌డీ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ నెల 6న కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు

Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన

Telangana Rains: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ‘ద ఇండియన్ మెటీయోరాలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ (ఐఎమ్‌డీ)’ ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఐఎమ్‌డీ సంస్థ తెలంగాణకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

SpiceJet: మరో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్… ఒకే రోజు రెండు ఘటనలు

ఐఎమ్‌డీ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఈ నెల 6న కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీని ప్రకారం జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. యెల్లో అలర్ట్ ప్రకారం ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

Cab Driver: ప్యాసింజర్‌ను కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్

జూలై 7న ఆరెంజ్ అలర్ట్ ప్రకారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, యెల్లో అలర్ట్ ప్రకారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భోనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 8, 9 తేదీల్లో యెల్లో అలర్ట్ ప్రకారం ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.