Cute Charge: ‘క్యూట్ చార్జి’ వసూలు చేస్తున్న ఇండిగో.. నెటిజన్ల జోకులు

ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్‌పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

Cute Charge: విమానంలో ప్రయాణించేందుకు బుక్ చేసుకునే టికెట్ చార్జీలో అనేక చార్జీలు కలిపి ఉంటాయి. ఎయిర్ ఫేర్ చార్జెస్, సీట్ ఫీ, సెక్యూరిటీ ఫీ, డెవలప్‌మెంట్ ఫీ వంటివి ఉండటం మామూలే. కానీ, ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్‌పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

Tata Technologies: 18 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓ

‘‘వయసుతోపాటు నాలో క్యూట్‌నెస్ కూడా పెరిగిపోతుందని నాకూ తెలుసు. కానీ, దీనికి ఇండిగో సంస్థ చార్జి వసూలు చేస్తుందని మాత్రం అనుకోలేదు’’ అంటూ ఆ నెటిజన్ పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. కొందరు ‘క్యూట్ చార్జి’ని క్యూట్‌గా ఉన్నందుకు విధించే చార్జి అనుకుంటున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు దీనిపై జోక్స్ వేస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘‘నన్నెవరైనా క్యూట్‌గా ఉన్నావు అంటే వంద రూపాయలు చెల్లించేందుకు అస్సలు బాధపడను. సింగిల్స్ బాధ గురించి మీకేం తెలుసూ’’ అంటూ స్పందించాడు. మరో నెటిజన్ స్పందింస్తూ ‘క్యూట్‌గా ఉన్నందుకు వసూలు చేసే చార్జి అయితే.. నేను వంద రూపాయలు మిగుల్చుకోగలను’ అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.

Anam Mirza: ‘అప్నే లోగాన్’.. హైదరాబాదీ నయా టాక్ షో

అయితే, అదే పోస్టులో డెవలప్‌మెంట్ చార్జీలు ఉండటంపై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘నిన్ను వాళ్లు డెవలప్ చేయాలనుకుంటున్నారు. అందుకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. అది నీ క్యూట్ చార్జీలకంటే 3.5 రెట్లు ఎక్కువ’’ అంటూ ఒక నెటిజన్ రిప్లై ఇచ్చాడు. అయితే క్యూట్ చార్జి అంటే అసలు అర్థం వేరు. ‘కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్‌మెంట్ చార్జి’ అని అర్థం. అంటే ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో వాడే మెటల్ డిటెక్టర్, ఎస్కలేటర్ వంటికి వసూలు చేసే చార్జి.

ట్రెండింగ్ వార్తలు