Is Release Date Locked For Pawan Kalyan Hari Hara Veera Mallu
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ సినిమాను తెరకెక్కించగా, ఈ చిత్రంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ పవర్‌ఫుల్ రోల్‌లో నటించి మెప్పించాడు. ఇక త్రివిక్రమ్ డైలాగులు ఈ సినిమాకు మరో బలంగా నిలవగా, థమన్ సంగీతం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఓవరాల్‌గా భీమ్లా నాయక్ చిత్రంతో పవన్ కళ్యాణ్ మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెనడియన్ బ్యూటీ!
ఇక ఈ చిత్రం తరువాత పవన్ తాను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పుడు మరో రీమేక్ చిత్రంపై కన్నేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ చిత్రం ‘వినోదయ సీతం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడట. ఈ సినిమాను ముందుగా పూర్తి చేసిన తరువాత దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి మిగతా భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఈ మేరకు అక్టోబర్ 5న హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర దర్శకుడు క్రిష్ ఫిక్స్ అయ్యాడట.
Pawan Kalyan: పవర్ ట్రీట్.. పవన్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్
అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, వీఎఫ్ఎక్స్ పనులు మిగిలి ఉండటంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. కానీ, డైరెక్టర్ క్రిష్ తన సినిమాలను ఎంత త్వరగా పూర్తి చేస్తాడో మనకు తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఈయేడు దసరాకు పవన్ కళ్యాణ్‌ను హరిహర వీరమల్లుగా మనం చూడటం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.