TRS Ready Operation Munugodu : ఆపరేషన్ మునుగోడుకు టీఆర్‌ఎస్ సిద్ధమయిందా..? పట్టుతగ్గలేదని నిరూపించుకోవడమే వ్యూహమా..?

ఆపరేషన్ మునుగోడుకు టీఆర్‌ఎస్ సిద్ధమయిందా..? ఈ ఉప ఎన్నికతో తెలంగాణపై తమకే పట్టుందని నిరూపించుకోవడమే టీఆర్‌ఎస్ వ్యూహమా..? ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే..ఆమోదించడం వెనక వ్యూహం ఇదేనా..? ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థి పార్టీలకు, ప్రజలకు సంకేతాలు పంపిస్తోందా..? అంటే అవుననే అనిపిస్తోంది.

TRS ready operation Munugodu : ఆపరేషన్ మునుగోడుకు టీఆర్‌ఎస్ సిద్ధమయిందా..? ఈ ఉప ఎన్నికతో తెలంగాణపై తమకే పట్టుందని నిరూపించుకోవడమే టీఆర్‌ఎస్ వ్యూహమా..? ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే..ఆమోదించడం వెనక వ్యూహం ఇదేనా..? ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థి పార్టీలకు, ప్రజలకు సంకేతాలు పంపిస్తోందా..? అంటే అవుననే అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడులో ఘనవిజయం సాధించడం ద్వారా పార్టీ క్యాడర్‌లో, దిగువస్థాయి నేతల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలుపుకు పర్యాయపదంగా ఉన్న టీఆర్‌ఎస్‌ గత చరిత్రను అలాగే కొనసాగించాలని దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం కానివ్వొద్దన్నది గులాబీదళం ఆలోచనగా ఉంది.

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమర్పించి..అసెంబ్లీ భవనాన్ని వీడకముందే…ఆమోదం తెలుపుతున్నట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. మరుక్షణమే ఉప ఎన్నికపై ఊహాగానాలు బయలుదేరాయి. నవంబరు లేదా డిసెంబరులో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడుకు ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా సమాచారం తెలంగాణ స్పీకర్ కార్యాలయం ఈసీకి అందిస్తుంది. అనంతరం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ పరిశీలిస్తుంది.

TRS Ready Munugodu By-Election : మునుగోడుపై దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు..ఉపఎన్నికకు సిద్ధమని టీఆర్ఎస్ సంకేతాలు!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక అత్యంత కీలకం. అయితే మిగిలిన పార్టీలన్నింటితో పోలిస్తే టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంతోంది. మునుగోడులో విజయం సాధించి ఒకే దెబ్బకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్నది ఆ పార్టీ ఆలోచన. దుబ్బాక, హుజూరాబాద్ రెండూ టీఆర్‌ఎస్ స్థానాలు. తమ సొంత స్థానాల్లో ఓడిపోవడం..అప్పట్లో క్యాడర్‌లో కొంత ఆందోళన కలిగించింది. కానీ మునుగోడు కాంగ్రెస్ స్థానం. కాంగ్రెస్ మాజీ నేత బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీచేసే కోమటిరెడ్డిని, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా రెండు పార్టీలను నైతికంగా దెబ్బతీయవచ్చని..టీఆర్‌ఎస్ సత్తా చాటవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

సరైన అభ్యర్థిని ఎంపిక చేసి..హుజూర్ నగర్, నాగార్జున సాగర్ తరహాలో ప్రచారం నిర్వహిస్తే మునుగోడులో కారు దూసుకుపోతుందని టీఆర్‌ఎస్ ఆలోచన చేస్తోంది. ఉప ఎన్నికకు ఇంకా నాలుగైదు నెలల సమయముండడంతో ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా టీఆర్ఎస్‌ తమ వ్యూహాలు అమలుచేయడానికి అన్ని విధాలా అవకాశముంది. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, కొత్త హామీలు, పెండింగ్ పనులకు నిధులు మంజూరు, అభివృద్ధి కార్యక్రమాలతో మునుగోడు రాజకీయ స్వరూపాన్ని మార్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ ఉప ఎన్నిక జరిగేదాకా తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు చుట్టూనే తిరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు