TRS Ready Munugodu By-Election : మునుగోడుపై దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు..ఉపఎన్నికకు సిద్ధమని టీఆర్ఎస్ సంకేతాలు!

మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న టీఆర్ఎస్.. ఉపఎన్నికకు తాము సిద్ధమని సంకేతాలిచ్చింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. మునుగోడులో సైలెంట్‌గా టీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. అటు సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్.. ఇజ్జత్ కా సవాల్ అంటోంది. ఇక మునుగోడు గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

TRS Ready Munugodu By-Election : మునుగోడుపై దూకుడు పెంచిన ప్రధాన పార్టీలు..ఉపఎన్నికకు సిద్ధమని టీఆర్ఎస్ సంకేతాలు!

TRS ready munugodu by-election

TRS ready munugodu by-election : మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న టీఆర్ఎస్.. ఉపఎన్నికకు తాము సిద్ధమని సంకేతాలిచ్చింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. మునుగోడులో సైలెంట్‌గా టీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. అటు సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్.. ఇజ్జత్ కా సవాల్ అంటోంది. మునుగోడు ఉపఎన్నికపై ఇప్పటికే కమిటీ వేసి పని ప్రారంభించిన కాంగ్రెస్.. మునుగోడులో సభ పెట్టి క్యాడర్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ఇక మునుగోడు గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గెలుపు ద్వారా సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూర్చించేందుకు కసరత్తు చేస్తోంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం (ఆగస్టు8,2022) ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసైను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వంపై, మరోవైపు టీపీసీసీ ప్రెసిడెంట్ పై విమర్శలు చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని, దీనిలో తెలంగాణ, మునుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అరాచక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తన రాజీనామా అంశం ముందుకు వచ్చిందని అన్నారు. కేసీఆర్ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని కాపాడుకోవాలని అన్నారు. తనపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటూ స్పష్టం చేశారు.