King Cobra: వామ్మో.. కింగ్ కోబ్రాతోనే ఆటలా.. అంతతేలిగ్గా ఉండదు.. వీడియోచూసి నెటిజన్లు ఏమన్నారంటే..

చిన్నపాటి పామును రోడ్డుపై వెళ్తూ మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇక దాని దరిదాపుల్లో కూడా ఉండం.

King Cobra: చిన్నపాటి పామును రోడ్డుపై వెళ్తూ మనకు తారసపడితేనే మన ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటిది కింగ్ కోబ్రా కనిపిస్తే.. ఇక దాని దరిదాపుల్లో కూడా ఉండం. అయితే భారీ కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి తన చేతులతో పట్టుకొనే ప్రయత్నం చేశాడు. కింగ్ కోబ్రాతో అంత తేలిగ్గా ఉంటుందా.. తనను పట్టుకున్న వ్యక్తిపై బుసలు కొడుతూ దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: అయ్యయ్యో బిడ్డా.. మేం ఉన్నాం కంగారుపడకు.. నీటి కొలనులో పడిన ఏనుగు పిల్లను ఏనుగులు ఎలా రక్షించాయే చూడండి..

మైక్ హోల్ స్టన్ అనే వ్యక్తి ఓ భారీ కింగ్ కోబ్రా తోకను పట్టుకొని దానిని నియంత్రించే ప్రయత్నం చేయబోయాడు. వ్యక్తి పామును నేల నుంచి పైకి లేపడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపించింది. అయితే కోబ్రా మాత్రం అందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తనను పట్టుకున్న వ్యక్తిపై ఎగిరి దూకేందుకు ప్రయత్నించసాగింది. అతను దానినుంచి తప్పించుకున్నాడు. ఇలా కొద్ది సేపు కింగ్ కోబ్రా, మైక్ హోల్ స్టన్ మధ్య పోరాటం సాగినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది 12 అడుగులు ఉంటుందని మైక్ హోల్ స్టన్ పేర్కొన్నాడు. ఇది ఓ గ్రామంలోకి వచ్చిందని, దానిని అడవిలోకి పంపించే క్రమంలో దీనిని పట్టుకోవటం జరిగిందని తెలిపాడు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కొద్ది గంటల్లోనే 5.6 మిలియన్లకుపైగా నెటిజన్లు వీక్షించారు. అలాంటి క్రూరమైన పామును వ్యక్తి తన చేతులతో పట్టుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ తన కామెంట్ లో.. ఆ వ్యక్తి “మృత్యువుతో ఆడుకుంటున్నాడు” అంటూ రాసుకొచ్చాడు. కొందరు నెటిజన్లు ఈ పామును చూసి నివ్వెరపోయారు. దానిని ఒంటరిగా వదిలేయండి అని రాసుకొచ్చారు. అలాంటి పాముతో ఎప్పుడూ గొడవ పడకూడదని కొందరు ప్రతిజ్ఞ చేశారు.

ట్రెండింగ్ వార్తలు