Viral Video: అయ్యయ్యో బిడ్డా.. మేం ఉన్నాం కంగారుపడకు.. నీటి కొలనులో పడిన ఏనుగు పిల్లను ఏనుగులు ఎలా రక్షించాయే చూడండి..

ఒక బిడ్డ వారి తల్లిదండ్రులకు గొప్ప సంపద. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా ప్రేమానురాగాలు అదే స్థాయిలో ఉంటాయి.

Viral Video: అయ్యయ్యో బిడ్డా.. మేం ఉన్నాం కంగారుపడకు.. నీటి కొలనులో పడిన ఏనుగు పిల్లను ఏనుగులు ఎలా రక్షించాయే చూడండి..

Elephant

Viral Video: ఒక బిడ్డ వారి తల్లిదండ్రులకు గొప్ప సంపద. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా ప్రేమానురాగాలు అదే స్థాయిలో ఉంటాయి. బిడ్డ ఆపదలో ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడేందుకు ఏమైనా చేస్తారు. అవసరమొస్తే.. ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొలనులో మునిగిపోతున్న ఏనుగు పిల్లను రక్షించేందుకు ఏనుగులు చేసిన ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Google Surprise to RRR : RRR కోసం గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌.. గూగుల్ లో RRR అని వెతికి చూడండి..

గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో తల్లి, పిల్ల ఎనుగులు కొలను ( జూ పార్కులో ఏర్పాటు చేసిన నీటి గుంత) వద్ద నీరు తాగుతూ కనిపిస్తాయి. రెండు పెద్ద ఏనుగులు, ఒక పిల్ల ఏనుగు ఉంటుంది. ఉన్నట్లుండి పిల్ల ఏనుగు కొలనులో పడిపోతుంది. దానిని రక్షించుకొందుకు పెద్ద ఏనుగు అనేక ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోవటంతో రెండు పెద్ద ఏనుగులు కలిసి కొలనులోకి వెళ్తాయి. మునిగిపోతున్న ఏనుగు పిల్లను బయటకు లాక్కురావడం వీడియోలో కనిపిస్తుంది. అయితే.. సియోల్ జూలో రెండు ఏనుగులు కొలనులో మునిగిపోయిన పిల్ల ఏనుగును రక్షించాయి అంటూ గాబ్రియేల్ కార్నో తెలిపాడు.

ఈ వీడియోను షేర్ చేసిన కొద్దిగంటల్లోనే 6.7లక్షల మంది వీక్షించారు. 34వేల కంటే ఎక్కువ లైక్ లు వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు తల్లిదండ్రుల ప్రేమను పొగుడుతూ కామెంట్లు చేశారు. పిల్లలను రక్షించాల్సిన అవసరం ఇలా ఉంది! జంతువులు మానవుల కంటే చాలా గొప్పవి. అవి ముప్పును చూసి చర్యలు తీసుకుంటాయి అంటూ ఓ నెటిజన్  కామెంట్ చేశాడు.