Jackie Shroff : జాకీ ష్రాఫ్‌ను వెంటాడే గతం.. ఇంత విషాదమా?
జాకీ ష్రాఫ్.. బాలీవుడ్‌లో మంచి పేరున్న నటుడు. తెరపై ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. తెరవెనుక మాత్రం ఎన్నో విషాదాలు చవి చూసారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న అనుభవాలు అభిమానుల్ని కంట తడి పెట్టించాయి.
- Lakshmi 10tv
- Published On : May 21, 2023 / 03:13 PM IST
Jackie Shroff
Jackie Shroff’s real life struggles : జాకీ ష్రాఫ్.. ప్రముఖ బాలీవుడ్ నటుడు.. మోడల్.. 200 పైగా సినిమాల్లో నటించారు. రీల్ లైఫ్‌లో ఎంతో సక్సెస్‌ని చూసిన నటుడు రియల్ లైఫ్‌లో మాత్రం కోలుకోలేని కష్టాలు చవి చూసారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో వరుసగా జరిగిన బాధాకరమైన సంఘటనల్ని గుర్తు చేసుకున్నారు.
Jackie Shroff – OK Computer: న్యూడ్ గెటప్‌లో జాకీ ష్రాఫ్.. వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కోసం కొత్త వేషం
జాకీ ష్రాఫ్.. నాలుగు దశాబ్దాలు వండర్ ఫుల్ కెరియర్‌ను చూసారు. పరీనా, త్రిదేవ్, హమ్ భీ ఇన్సాన్ హై, దూద్ కా కర్జ్, 1942 ఎ లవ్ స్టోరీ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. దాదాపుగా 220 పైనే సినిమాల్లో నటించిన జాకీ ష్రాఫ్ రియల్ లైఫ్ కష్టాలు తెలిస్తే మనసు చలించిపోతుంది. జాకీ ష్రాఫ్ తన తల్లి, అన్నయ్యను చిన్నతనంలోనే కోల్పోయారు. ఆయన అన్నయ్య మరణం చాలా విషాదం. స్నేహితుడిని కాపాడటానికి సముద్రంలోకి దూకి తన ప్రాణాలు కోల్పోయాడట. అప్పుడు ఆయన అన్న వయసు 17 సంవత్సరాలు కాగా.. జాకీ ష్రాఫ్‌కి 10 సంవత్సరాలట.
జాకీ ష్రాఫ్ అన్న సెంచురీ మిల్‌లో పనిచేస్తుండేవారట. జ్యోతిష్యుడైన తండ్రి ఆరోజు తన అన్న జాతకం బాగాలేదని బయటకు వెళ్లొద్దని వారించారట. అయినా ఆయన మాట వినకుండా వెళ్లిన అన్న విగతజీవిగా ఇంటికి వచ్చాడని జాకీ ష్రాఫ్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా మనసు మెలిపెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తన అన్నను ఫస్ట్ రియల్ హీరోగా పిలుచుకుంటారు జాకీ ష్రాఫ్. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని విషాదకర సంఘటనలు వెంటాడుతుంటాయని అలా తన జీవితంలో తన అన్నయ్య మరణం ఎప్పటికీ మర్చిపోలేని బాధను కలిగిస్తుందని జాకీ ష్రాఫ్ ఎమోషనల్ అయ్యారు.
Sonu Sood : రియల్ హీరో పై అభిమానుల ప్రేమ.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ రూపం..
జీవితంలో ఎన్ని కష్టాలు చూసినా కెరియర్‌లో ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నారాయన. 2022లో అతిథి భూతో భవ .. 2023లో బాప్ సినిమాల్లో నటించారు. అనుకుంటాం కానీ స్టార్స్ జీవితాల్లో మనం కనిపెట్టలేని ఎన్నో విషాద గాథలు ఉంటాయి. స్క్రీన్ పై నవ్వుతూ కనిపించే జాకీ ష్రాఫ్ గుండెలో ఇంత బాధ ఉందని తెలిసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
