Sonu Sood : రియల్ హీరో పై అభిమానుల ప్రేమ.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ రూపం..

సోనూ సూద్ (Sonu Sood) తన సేవలతో దేశమంతటా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా మధ్యప్రదేశ్ లోని కొందరు అభిమానులు సోనూ సూద్ పై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.

Sonu Sood : రియల్ హీరో పై అభిమానుల ప్రేమ.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ రూపం..

Sonu Sood fans express their gratitude by carving his face with 2500 kgs rice

Sonu Sood : సినిమాల్లో విలన్ గా నటించి అందర్నీ భయపెట్టిన సోనూ సూద్ (Sonu Sood) రియల్ లైఫ్ లో మాత్రం అందరికి దేవుడు అవుతున్నాడు. కోవిడ్ వంటి విపత్తు వచ్చిన సమయంలో అయిన వాళ్ళు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో తాను ఉన్నానంటూ ఎంతోమందికి ధైర్యం అయ్యాడు. లాక్ డౌన్ లో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన అనేమందిని తన సొంత ఖర్చుతో వారి ప్రాంతాలకు తరలించి ఆపద్బాంధవుడు అయ్యాడు. కరోనా విఆప్ట్ అనంతరం కూడా తన సేవలకు బ్రేక్ ఇవ్వలేదు. ఒక స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికీ చేయూతని అందిస్తూ వస్తున్నాడు.

Sonu Sood : కరోనాతో జాగ్రత.. నా పాత నెంబర్ పని చేస్తుంది.. సోనూ సూద్!

ఇక ఆ సేవలను గుర్తించి పలువురు సోనూ సూద్ ని అభినందిస్తూ సత్కరిస్తున్నారు. సాధారణ ప్రజలు అయితే సోనూ సూద్ కి అభిమానులు అయ్యిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రాష్ట్రంలో సోనూ సూద్ అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. కాగా మధ్యప్రదేశ్ లోని కొందరు అభిమానులు సోనూ సూద్ పై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఒక ఎకరం స్థలంలో 2500 కేజీల బియ్యంతో సోనూ సూద్ రూపాని తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్ దేవాస్ లోని తుకోజీరావు పవార్ స్టేడియంలో నెల పై నల్లటి ప్లాస్టిక్ షీట్ ని పరిచి దాని బియ్యంతో సోనూ సూద్ రూపాని ఆవిష్కరించారు.

కాగా ఈ ఆవిష్కరణకి ఉపయోగించిన బియ్యం మొత్తాన్ని అవసరం ఉన్న వారికి దానం చేయనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ మొత్తం ఆవిష్కరణని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యి సోనూ సూద్ కి వరకు చేరుకుంది. దీనికి సోనూ రియాక్ట్ అవుతూ.. ‘మీరు చూపిస్తున్న ప్రేమకి నాకు మాటలు కూడా రావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.