England vs India: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా అద్భుతమైన రీతిలో పట్టిన క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఇంగ్లండ్ క్రికెట్’ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో ఇంగ్లండ్ మూడో వన్డే ఆడుతోన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఇంగ్లండ్ జట్టు. జట్టులోని టాప్ ఆర్డర్ విఫలమవుతున్న వేళ జోస్ బట్లర్ 60 పరుగులు చేశాడు.
K Kavitha: రాహుల్ గాంధీ భారత్‌లోనే ఉన్నారా?: కవిత చురకలు
అనంతరం హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో జోస్ బట్లర్ భారీ షాటు ఆడడానికి ప్రయత్నించాడు. అయితే, రవీంద్ర జడేజా అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టడంతో జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. ఈ వీడియోనే ‘ఇంగ్లండ్ క్రికెట్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఈ మ్యాచులో 45.5 ఓవర్ల వద్ద 259 పరుగులకు ఆలౌట్ అయింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా యజువేంద్ర చాహల్ 3, మొహమ్మద్ సిరాజ్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్టు తీశారు.
A fine catch from Jadeja removes Buttler.
Scorecard/clips: https://t.co/2efir2v7RD
??????? #ENGvIND ?? pic.twitter.com/5zIQnQ8Nh4
— England Cricket (@englandcricket) July 17, 2022
Two stunning catches in the deep by @imjadeja ??
Definitely one of the best fielders in the world.#TeamIndia #ENGvIND pic.twitter.com/qs5bqdGPjc
— BCCI (@BCCI) July 17, 2022