perni nani: వచ్చే రెండేళ్ళ‌లో ఏమి చేస్తామో జగన్ నేడు చెబుతారు: పేర్ని నాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త‌మ ప్ర‌భుత్వం వచ్చే రెండేళ్ళ‌లో ఏమి చేస్తుందో సీఎం జగన్ నేడు వైసీపీ ప్లీనరీలో చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ పేర్ని నాని 10 టీవీతో మాట్లాడుతూ... నేటి జగన్ సందేశం హైలైట్ అవ్వబోతుందని అన్నారు.

Minister Perni Nani

perni nani: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని త‌మ ప్ర‌భుత్వం వచ్చే రెండేళ్ళ‌లో ఏమి చేస్తుందో సీఎం జగన్ నేడు వైసీపీ ప్లీనరీలో చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ పేర్ని నాని 10 టీవీతో మాట్లాడుతూ… నేటి జగన్ సందేశం హైలైట్ అవ్వబోతుందని అన్నారు. జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్‌కి సందేహాలు ఉంటే ప్లీనరీకి రావాలని చెప్పారు. సందేహాల‌ను త‌మ‌ కార్యకర్తలే నివృత్తి చేస్తార‌ని అన్నారు. ప్లీనరీ జరుగుతుంటే తన ఉనికి కోసం పవన్ మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

Gautam Adani: టెలికాం రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి అదానీ సిద్ధం!

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో నవరత్నాల అమలు అవుతున్నాయని ఆయ‌న చెప్పారు. ప‌థ‌కాలు అందుకునే అర్హత ఉన్న వారికి అందిస్తున్నామ‌ని, అర్హులు కాని వారిని తిసేస్తామ‌ని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోలేదని ఆయ‌న చెప్పారు. హరికృష్ణ బ్రతికి ఉంటే ఆ ద్రోహం గురించి చెప్పేవారని, దగ్గుబాటి వెంకటేశ్వ‌రరావు చాలా సార్లు చెప్పారని ఆయ‌న అన్నారు. జగన్ స‌హా త‌మ కార్యకర్తల సమక్షంలో విజయమ్మ త‌న రాజీనామా నిర్ణ‌యాన్ని ప్రకటించారని ఆయ‌న చెప్పారు.