Gautam Adani: టెలికాం రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి అదానీ సిద్ధం!

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ త్వరలోనే టెలికాం సర్వీసుల్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన‌ 72,097.85 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలం జూలై 26 నుంచి జరగనుంది.

Gautam Adani: టెలికాం రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి అదానీ సిద్ధం!

Adani Group Is Now A Key Player In The Cement Sector

Gautam Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ త్వరలోనే టెలికాం సర్వీసుల్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన‌ 72,097.85 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలం జూలై 26 నుంచి జరగనుంది. నిన్న ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ముగిసింది. అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిసింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంస్థ‌ల్లో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో, భార‌తి మిట్ట‌ల్‌కు చెందిన‌ ఎయిర్‌టెల్‌తో పాటు వొడాఫోన్‌ ఐడియా, అదానీ గ్రూప్‌ కూడా ఉన్నట్లు స‌మాచారం.

union cabinet: కేంద్ర కేబినెట్‌లో మార్పులు?.. తెలంగాణ ఎంపీకి చోటు

దరఖాస్తు చేసుకున్న సంస్థ‌ల‌ వివరాలను జూలై 12న అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌తో పాటు ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ లైసెన్సులను అదానీ గ్రూప్‌ పొందింది. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ ఇప్పటివరకు ఏ వ్యాపారంలోనూ నేరుగా పోటీ ప‌డ‌లేదు. ముకేశ్‌ అంబానీ చమురు, పెట్రో రసాయనాల వ్యాపారాల్లో, అదానీ గనులు, నౌక, విమానాశ్రయాలు, విద్యుత్తు పంపిణీ వంటి వ్యాపారాల్లో ఉన్న విష‌యం తెలిసిందే. అలాగే, ముకేశ్ అంబానీ టెలికాం-రిటైల్‌ రంగాల్లోనూ ప్ర‌వేశించారు. ఇప్పుడు అదానీ కూడా టెలికాం రంగంలోకి ప్ర‌వేశిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేగాక‌, పెట్రో రసాయనాల వ్యాపారంలోకి ప్రవేశించాల‌ని కూడా అదానీ అనుబంధ సంస్థను ఏర్పాటు చేశారు.