Jagdeep Dhankhar: భారతదేశ నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ దిన్‌కర్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పోలింగ్ లో 346 ఓట్ల తేడాతో విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై విజయం సాధించారు. మొత్తం ఓట్లు 780కాగా, 725 ఓట్లు పోలయ్యాయి. జగదీప్ దిన్ కర్ కు మొత్తం 74.36శాతంతో 528 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి అల్వాకు కేవలం 182 ఓట్లు పోలయ్యాయి. భారీ ఓట్ల తేడాతో జగదీప్ ధన్‌కర్ నూతన ఉప రాష్ట్రపతిగా విజయం సాధించారు.
Jagdeep Dhankhar : ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ విజయం
జగదీప్ ధన్‌కర్ 1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. చిత్తోర్ గఢ్ సైనిక స్కూల్ లో మెరిట్ స్కాలర్ షిప్ తో ప్రాథమిక విద్య, జైపూర్ మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఎల్ ఎల్ బీ పూర్తయ్యాక రాజస్తాన్ బార్ కౌన్సిల్ లో 1979లో అడ్వకేట్ గా నమోదు చేసుకున్నారు. 1989లో క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన జగదీప్ దిన్‌కర్ ఏడాది తర్వాత సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. దిన్‌కర్ భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి చౌదరి దేవి లాల్‌తో సన్నిహిత సంబంధం కలిగిఉండేవాడు.
Jagdeep Dhankhar : జగదీప్ ధన్‌కర్ ఎవరంటే..? ‘రైతు బిడ్డగా’ మారుమూల గ్రామం నుంచి..
ధన్ కడ్ జనతాదళ్ పార్టీలో చేరి.. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ వ్యవస్థాపకుడు దేవీలాల్ అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఆశీస్సులతో 1989లో ఝుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి వీపీ సింగ్ సర్కార్ నుంచి దేవీలాల్ బయటికొచ్చినప్పుడు ధన్ కడ్ ఆయన వెంటే నడిచారు. చంద్రశేఖర్ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు. పీవీ నరసింహారావు హయాంలో ఆయన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. అయితే రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ఎదుగుదలతో బీజేపీకి మారారు.
Congratulations to Shri Jagdeep Dhankhar Ji on being elected India’s Vice President with resounding support across party lines. I am confident he will be an outstanding Vice President. Our nation will gain tremendously from his intellect and wisdom. @jdhankhar1 pic.twitter.com/YD8BHb512W
— Narendra Modi (@narendramodi) August 6, 2022
2003లో బీజేపీలో చేరి రాష్ట్ర బీజేపీలో వసుంధర రాజెకు దగ్గరయ్యారు. కొద్దికాలం పార్టీలో కొనసాగి.. పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపో్యారు. జులై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జాట్ల నేత అయిన జగదీప్ ధన్‌కడ్.. ఎన్డీయే అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. నూతన ఉప రాష్ట్రపతిగా 11న జగదీప్ ధన్‌కడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.