Jagdeep Dhankhar : జగదీప్ ధన్‌కర్ ఎవరంటే..? ‘రైతు బిడ్డగా’ మారుమూల గ్రామం నుంచి..
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక అయిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు.

Who Is Jagdeep Dhankhar, The Nda's Vice Presidential Choice
Jagdeep Dhankhar : భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక అయిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాజస్థాన్‌కు చెందిన సీనియర్ న్యాయవాదిగా పేరొందిన జగదీప్.. 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కితానా అనే ఓ మారుమూల పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి స్వశక్తితో ఎదిగిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు సాధించారు. న్యాయనిపుణిడిగా తన కెరీర్ మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. కాలినడకనే ప్రతిరోజూ 5 కిలోమీటర్ల వరకు వెళ్లి చదువుకునే వాడనని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెబుతుండేవారు. అలాంటి సాధారణ రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం.. ఒక సీనియర్ రాజకీయవేత్తగా బెంగాల్ గవర్నర్ స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడు జగదీప్ రాజకీయ అనుభవం, ఆయన చేసిన కృషిని గుర్తించిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
ఈ సందర్భంగా బీజేపీ పార్టీ చీఫ్ JP నడ్డా ధనఖర్‌ని కిసాన్ పుత్ర (రైతు కొడుకు) అని కొనియాడారు. 71 ఏళ్ల జగదీప్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపును పొందడమే కాకుండా తన వృత్తిలో గొప్ప న్యాయవాది కూడా రాణించారు. అసంఖ్యాకమైన సామాజిక, ఆర్థిక అవరోధాలను అధిగమించి, తన లక్ష్యాలను సాధించడం ద్వారా జగదీప్ తనకుంటూ ఒక గుర్తింపును పొందారు. చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్‌లో స్కాలర్‌షిప్‌లను కూడా గెలుచుకున్నారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత.. రాజస్థాన్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. మొదటి జనరేషన్ ప్రొఫెషనల్‌గా రాష్ట్రంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా కీర్తి ప్రఖ్యాతలను సంపాదించారు. జగదీప్ రాజస్థాన్ హైకోర్టు భారత సుప్రీంకోర్టు రెండింటిలోనూ ప్రాక్టీస్ చేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్‌గా మూడు దశాబ్దాలకు పైగా ప్రజా ప్రతినిధిగా ఉన్నారు.

Who Is Jagdeep Dhankhar, The Nda’s Vice Presidential Choice
1989 లోక్‌సభ ఎన్నికల్లో జుంజును నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అనంతరం 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జూలై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లోనూ మెంబర్‌గా పని చేశారు. కొన్నాళ్లపాటు సుప్రీంకోర్టులోనూ పని చేసిన ఆయన 2003లో బీజేపీలో చేరారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. జగదీప్ భార్య సుదేశ్ ధన్‌కర్. కామ్నా కూతురు ఉన్నారు. అల్లుడు కార్తీకేయ వాజ్‌పాయి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. మైనార్టీ కోటాలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా.. ఊహించని రీతిలో ధన్‌కర్ పేరును బీజేపీ తెరపైకి తేవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also : Vice Presidential candidate: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్