Rajya Sabha Polls: ఓటు వేస్తా.. ఒక్కరోజు బెయిల్ ఇవ్వండి: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు.
- T Venkateshwarlu
- Published On : June 6, 2022 / 02:25 PM IST
Nawab Malik
Rajya Sabha Polls: నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర నుంచి ఆరు సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. నగదు అక్రమ చలామణీ కేసులోనే జైలులో ఉన్న మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా తనకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాలని గత వారం పిటిషన్ వేశారు.
cpm: పొత్తులు అంటూ బీజేపీ చర్చలకు దారితీసింది: సీపీఎం నేత మధు
నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ పిటిషన్లను సోమవారం పరిశీలించిన ముంబైలోని కోర్టు.. వాటిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సూచించింది. దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజునే తమకు బెయిల్ కావాలని మాలిక్, దేశ్‌ముఖ్ కోరుతున్నారు. తాను ప్రజలు ఎన్నుకున్న ఓ ఎమ్మెల్యేనని, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం తమ విధి అని నవాబ్ మాలిక్ చెప్పారు. కాగా, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కార్యకలాపాల కేసులో నవాబ్ మాలిక్‌ను ఈడీ ఈ ఏడాది ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది.
