cpm: పొత్తులు అంటూ బీజేపీ చర్చలకు దారితీసింది: సీపీఎం నేత మ‌ధు

ఎన్నిక‌ల్లో పొత్తులు అంటూ బీజేపీ చర్చలకు దారితీసిందని సీపీఎం నేత‌ మధు అన్నారు. జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయ‌న సూచించారు.

cpm: పొత్తులు అంటూ బీజేపీ చర్చలకు దారితీసింది: సీపీఎం నేత మ‌ధు

Madhu Cpi

cpm: ఎన్నిక‌ల్లో పొత్తులు అంటూ బీజేపీ చర్చలకు దారితీసిందని సీపీఎం నేత‌ మధు అన్నారు. జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయ‌న సూచించారు. నేడు ఆయన విశాఖ‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పక్షాన వెళ్లిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటున్నారని చెప్పారు. ఎన్నికలు, పొత్తులు, అంటూ రాజకీయం చేసి ప్రజా సమస్యలు పక్కదారి ప‌ట్టేలా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. వైసీపీ, బీజేపీ క‌లిసి ప్ర‌త్యేక‌ హోదా, రైల్వే జోన్ విభజన హామీలు నెర‌వేర‌కుండా మోసం చేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

Jogi ramesh: మంత్రి జోగి రమేశ్‌కు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

సీపీఎం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంద‌ని మధు అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆయ‌న చెప్పారు. విశాఖలో భూముల దందాలు పెరిగుతున్నాయని, దశపల్ల భూములపై పోరాటం చేస్తామ‌ని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో మూడేళ్ళ కాలంలో ప్రజల కష్టాలు మరిన్ని పెరిగాయ‌ని మధు అన్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగాయ‌ని, రైతు భరోసా పెట్టినా ఏ ఉపయోగమూ లేదని ఆయ‌న చెప్పారు. కనీసం పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదని విమ‌ర్శించారు. జూలై 11న నిర్వ‌హించ‌నున్న‌ నిరసన కార్య‌క్ర‌మంలో ప్రతి అంశాన్ని సీపీఎం ప్ర‌స్తావిస్తుంద‌ని చెప్పారు.