Jayesh Ranjan: అవగాహనా లోపం వల్లే సైబర్ నేరాలు: జయేష్ రంజన్

ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Jayesh Ranjan

Jayesh Ranjan: ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ‘‘సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్ సమయంలో కేవైసీ పేరుతో ఎక్కువ మోసాలు జరిగాయి. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నేర నియంత్రణ చర్యలు తీసుకున్నాం. టెక్నాలజీ వాడకంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువగా చదువుకున్నవాళ్లే సైబర్ నేరాల బారిన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ మెసేజ్‌లు పంపుతున్నారు.

Air Missiles: భారీ లక్ష్యాన్ని చేధించే అస్త్ర క్షిపణులు.. రెండేళ్లలో సిద్ధం

వీటిని ఓపెన్ చేయగానే వినియోగదారుల ఫోన్‌లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. ఇలాంటిమెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాటిని ఓపెన్ చేయకూడదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల ద్వారా అవసరమైన ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి. ఫోన్‌ పాస్‌వర్డ్‌లు, క్రెడిడ్, డెబిట్ కార్డుల పిన్ నెంబర్లు, ఓటీపీలు వంటి సమాచారం ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీ ఫోన్‌ను, అందులోని సమాచారాన్ని వేరే వాళ్లు యాక్సెస్ చేసే వీలుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని జయేష్ రంజన్ చెప్పారు.