Air Missiles: భారీ లక్ష్యాన్ని చేధించే అస్త్ర క్షిపణులు.. రెండేళ్లలో సిద్ధం

ఇప్పటికే ఎమ్‌కే-1 క్షిపణి సైన్యం దగ్గర ఉంది. దీని రేంజ్ వంద కిలోమీటర్లు మాత్రమే. అందుకే కొత్తగా.. మరింత దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే ఎమ్‌కే-2, ఎమ్‌కే-3 క్షిపణుల్ని రూపొందిస్తోంది డీఆర్‌డీఓ. ఎమ్‌కే-2ను వచ్చే ఏడాది పరీక్షిస్తే, ఎమ్‌కే-3ని 2024లో పరీక్షిస్తారు.

Air Missiles: భారీ లక్ష్యాన్ని చేధించే అస్త్ర క్షిపణులు.. రెండేళ్లలో సిద్ధం

Air Missiles

Air Missiles: గాలి నుంచి గాలిలోకి ప్రయోగించగల అధునాతన భారీ క్షిపణుల్ని భారత్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ‘ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)’ సంస్థ ‘అస్త్ర’ ఎమ్‌కే-2, ఎమ్‌కే-3 పేరుతో రెండు విధ్వంసక క్షిపణుల్ని రూపొందిస్తోంది. వీటిని గాలిలోంచే ప్రయోగించవచ్చు. అంటే విమానం గాలిలో ఉన్నప్పుడే నేరుగా ప్రయోగించవచ్చు. ఇవి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలవు.

Thief Arrest: ఎం.ఎన్.వో.ముసుగులో చోరీలు.. పట్టుకున్న పోలీసులు

ఇప్పటికే ఎమ్‌కే-1 క్షిపణి సైన్యం దగ్గర ఉంది. దీని రేంజ్ వంద కిలోమీటర్లు మాత్రమే. అందుకే కొత్తగా.. మరింత దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే ఎమ్‌కే-2, ఎమ్‌కే-3 క్షిపణుల్ని రూపొందిస్తోంది డీఆర్‌డీఓ. ఎమ్‌కే-2ను వచ్చే ఏడాది పరీక్షిస్తే, ఎమ్‌కే-3ని 2024లో పరీక్షిస్తారు. ‘ఎమ్‌కే-2’ 160 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధిస్తే, ‘ఎమ్‌కే-3’ దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధిస్తుంది. యుద్ధ రంగంలో వినియోగించే ఆయుధాలపై భారత్ ఎక్కువగా విదేశాలపై ఆధారపడేది. అయితే, కొంతకాలం నుంచి సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా 310 రకాల ఆయుధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదని, దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. అందుకే ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా స్వదేశీ టెక్నాలజీతో ఇక్కడే ఆయుధాలు తయారు చేస్తున్నారు. ప్రధానంగా రెండేళ్ల నుంచి అనేక ఆయుధాలను దేశంలోనే రూపొందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీకి ఎమ్‌కే-1 మిస్సైల్స్, వాటికి సంబంధించిన విడిభాగాలు అందించేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ గత నెల 31న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.2,971 కోట్లు. దీనికి సంబంధించిన టెక్నాలజీని డీఆర్‌డీఓ, బీడీఎల్‌కు బదిలీ చేసింది.

TTD: అమెరికాలో ఈ నెల 18 నుంచి శ్రీవారి కల్యాణోత్సవాలు

చైనా ఇప్పటికే ఇలాంటి క్షిపణుల్ని తయారు చేసింది. పీఎల్-15 పేరుతో తయారు చేసిన ఈ తరహా క్షిపణులు 200 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగలవు. పాశ్చాత్య దేశాల దగ్గర కూడా 160 కిలోమీటర్ల టార్గెట్ చేధించగలిగే క్షిపణులున్నాయి. భారత్ కనుక ‘అస్త్ర’ను సిద్దం చేయగలిగితే, ఈ లీగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటుంది. ‘‘భవిష్యత్తులో గగన తల యుద్దం వీటి ఆధారంగానే జరుగుతుంది. దూరంలోని లక్ష్యాలను గుర్తించడం, చేధించడంపైనే యుద్ధాలు ఆధారపడి ఉంటాయి. అందుకే భారత్ ‘అస్త్ర’లాంటి ఆయుధాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’’ అని రక్షణ శాఖకు చెందిన ఉద్యోగి ఒకరు తెలిపారు.