Afghan8
Joe Biden అప్ఘానిస్తాన్ దేశం ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితులపై ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అఫ్గానిస్థాన్‌ను రోజుల వ్యవధిలోనే తాలిబన్లు హస్తగతం చేసుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ఉన్నతాధికారులు షాక్ అయ్యారని సమాచారం. దానివల్ల ఒక ప్రణాళిక ప్రకారం అప్ఘాన్‌ను వీడాల్సిన యూఎస్ భద్రతా దళాలు.. వేగంగా, జాగ్రత్తగా తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్ఘానిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. బైడెన్‌కు ఇది పరీక్షా సమయం లాంటిదే. ఇప్పటికే అప్ఘాన్ లో శాంతి నెలకొల్పడంలో ఆయన విఫలమయ్యారని రిపబ్లికన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే అమెరికా నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని బైడెన్ ఇప్పటికే సమర్థించుకున్నారు.
కాగా, ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయంలో అమెరికా సైన్యం చేపట్టిన నిష్క్రమణ ఆపరేషన్ కి అవరోధాలు సృష్టించకుండా ఉండాలని తాలిబన్ సీనియర్ నేతలను యూఎస్ కోరినట్లు తెలుస్తోంది. లేని పక్షంలో అమెరికా దళాలు కూడా ప్రతి చర్యలకు ఉపక్రమిస్తాయని తాలిబన్లను అమెరికా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కాగా, అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలుగుతున్న క్రమంలో ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారాన్ని అందుకున్నారు. అఫ్గాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆధునిక సామగ్రిని అఫ్గాన్ దళాలకు అమెరికా అప్పగించింది. శిక్షణ ఇచ్చింది. అయినా తాలిబన్లతో ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోయాయి.
READAfghanistan: బైడెన్ మోసం చేశారంటూ వైట్‌హౌజ్ ఎదుట ఆఫ్ఘన్ల ఆందోళన