Afghanistan: బైడెన్ మోసం చేశారంటూ వైట్‌హౌజ్ ఎదుట ఆఫ్ఘన్ల ఆందోళన
అమెరికాలో వైట్‌హౌజ్ ఎదుట అప్ఘన్ జాతీయులు బైడెన్‌కు వ్యతిరేకంగా వరుసగా రెండోరోజూ ఆందోళనలు చేేపట్టారు. బైడెన్ నమ్మక ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు.

People With Ties To Afghanistan Protest At White House
Afghanistan protest : అఫ్ఘానిస్తాన్ మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్ఘాన్ ప్రజలకు రక్షణగా దేశంలో రెండు దశాబ్దాలుగా మోహరించిన అమెరికా బలగాలు ఇప్పుడు ఉపసంహరించుకోవడంపై అఫ్ఘాన్ ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరికేస్తూ అఫ్ఘాన్ ప్రజలంతా వైట్ హౌస్ ఎదుట నిరసనగళం వినిపిస్తున్నారు. తాలిబన్లు చెలరేగిపోయి మొత్తం దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలగాల ఉపసంహరణ బైడెన్ వైఖరిని తప్పుబడుతూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అమెరికాలోని వైట్‌హౌజ్ ఎదుట అఫ్ఘాన్ జాతీయులు బైడెన్‌కు వ్యతిరేకంగా వరుసగా రెండోరోజూ కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బైడెన్ నమ్మక ద్రోహం చేశారు. దీనికి మీరే బాధ్యులు అంటూ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. తాలిబన్లు క్రూర పాలన గురించి తెలిసిన అఫ్ఘాన్ ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు.
Live updates: Fate of Afghan nationals who helped U.S. military is now in question https://t.co/rZmHxlBQgH
— CBS News (@CBSNews) August 15, 2021
తాలిబన్లు ఎలాగో చంపేస్తారు.. మహిళలకు స్వేచ్ఛ ఉండదిక :
తాలిబన్లు ఎలాగో మా ప్రజలను చంపేస్తారు.. మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదిక.. తమ ప్రజలను రక్షించే నాధుడే ఎవరు లేరని నిరసకారులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ల పాలనలో అక్కడి ప్రజల పరిస్థితి భయానకంగా ఉంటుందని భయాందోళన చెందుతున్నారు. ఆ దేశా మాజీ జర్నలిస్ట్ హమ్దర్ఫ్ గఫూరి మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ మేము 2000లోకి వెళ్లాము.. మాకు శాంతి కావాలని డిమాండ్ చేశారు. తాలిబన్ల చేతుల్లోకి వెళ్తే అక్కడ కొన్ని వేల మంది ఒసామా బిన్ లాడెన్లు, ముల్లా ఒమర్‌లు తయారవుతారని ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్‌తో చేతులు కలిపి మధ్య ప్రాచ్యంపై దాడికి ప్రయత్నిస్తారని నిరసనకారులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి తజకిస్థాన్‌కు పారిపోయారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని కూడా తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు.
Kabul : బతికితే చాలు..జనాలతో నిండిపోయిన కాబుల్ ఎయిర్ పోర్టు
Right now people are protesting outside the White House for a second day in a row #Afghanistan pic.twitter.com/cIaWssTGAM
— Kolbie Satterfield (@KolbieReports) August 15, 2021
మరోవైపు.. అప్ఘాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు సమీపించారని తెలియగానే అఫ్ఘాన్ల గుండెల్లో వణకుపుట్టింది. ఎక్కడికి పారిపోవాలో తెలియక వణికిపోతున్నారు. కుర్రాళ్లంతా కంగారుగా ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. వేసుకున్న టీ షర్ట్, జీన్స్‌లను తీసిపారేశారు. సంప్రదాయ దుస్తులను ధరిస్తున్నారు. కాబూల్ యూనివర్శిటీ విద్యార్థినులు తుది వీడ్కోలు చెప్పేశారు. యూనివర్శిటీకి వచ్చే పరిస్థితి లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్న పరిస్థితి. ఇప్పటికే తాలిబన్ల ఆక్రమణతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ దేశానికైనా వెళ్లి ఆశ్రయం పొందే అవకాశం లేక అక్కడి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Afghanistan : అందమైన అఫ్గాన్ లో కల్లోలం రేపిందెవరు?