Jogi Ramesh: పవన్ కల్యాణ్ “హైదరాబాద్” వాసి.. హరీశ్ రావు ఏపీకి రావాలి: ఏపీ మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh: పవన్ కల్యాణ్ పై జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, తెలంగాణ మంత్రి హరీశ్ రావుకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

Jogi Ramesh

Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ వాసి అని, విజిట్ వీసా మీద మాత్రమే ఆంధ్రకు వస్తున్నారని ఏపీ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. ఏలూరులో గృహనిర్మాణ శాఖ సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి జోగి రమేశ్ మాట్లాడారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు వంటి వారు ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం ఖాయమని చెప్పారు.

ఏపీ నేతలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలపై జోగి రమేశ్ స్పందించారు. హరీశ్ రావు ఏపీకి వస్తే ఇక్కడ ఏయే అభివృద్ధి పనులు జరిగాయో చూపిస్తామని అన్నారు. హరీశ్ రావు ఓసారి వచ్చి చూసిపోవాలని జోగి రమేశ్ చెప్పారు. గృహనిర్మాణాలపై సమస్యలను ఎమ్మెల్యేలు అంతా తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అన్నింటినీ పరిష్కరించి, పురోగతికి అధికారులకు అదేశాలిచ్చామని అన్నారు.

చంద్రబాబు శిఖండిలాగా ఇళ్ల నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని చెప్పారు. సెల్ఫీ పిచ్చితో చంద్రబాబు పిల్ల చేష్టలతో ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రంలోని కోటి 60 లక్షల ఇళ్ల వద్దకు రాగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా కాకపోయినా, కుప్పంలోకి వచ్చినా తమ అభివృద్ధి, సంక్షేమం ఏంటో చూపిస్తామని సవాలు విసిరారు.

Andha Pradesh : వైసీపీ నాయకులకు టీడీపీ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డితో కలిపి ఇచ్చేస్తాం : అచ్చెన్నాయుడు