Agnipath: అగ్నిపథ్ పథకాన్ని మోదీ ఉపసంహరించుకుంటారు: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
- T Venkateshwarlu
- Updated on- June 18, 2022 / 11:22 AM IST
Rahul Gandhi
Agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అగ్నిపథ్ పథకం వద్దంటూ దేశ యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు.
Rahul Gandhi : రాహుల్ విచారణ సోమవారానికి వాయిదా
”జై జవాన్, జై కిసాన్ విలువలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరుసగా ఎనిమిదేళ్లుగా కించపరుస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటారని ఇంతకు ముందే నేను చెప్పాను. ఇప్పుడూ నేను మరో విషయం చెబుతున్నాను.. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ మాఫీవీర్ (క్షమాపణలు చెప్పేవ్యక్తి)గా మారి దేశ యువత డిమాండ్‌కు తలొగ్గుతారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకుంటారు” అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
