Rahul Gandhi : రాహుల్‌ విచారణ సోమవారానికి వాయిదా

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్‌ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు.

Rahul Gandhi : రాహుల్‌ విచారణ సోమవారానికి వాయిదా

Rahul Gandhi

Rahul Gandhi : నేష‌న‌ల్ హెరాల్డ్‌ మ‌నీ లాండ‌రింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు విచారించింది ఈడీ. ఇవాళ నాలుగోరోజు విచారణకు హాజరుకావాలని సమన్లు కూడా ఇచ్చింది. కానీ… తన తల్లి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదే విష‌యాన్ని ఈడీకి వివరించిన రాహుల్.. త‌న త‌ల్లిని చూసుకోవ‌డం కోసం సోమ‌వారం వ‌ర‌కు విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని కోరారు. దీంతో రాహుల్‌గాంధీ అభ్యర్థన‌ను స‌మ్మతించిన ఈడీ… విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ గాంధీ తీరుపై ఈడీ అసంతృప్తి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం కొవిడ్‌ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆసుపత్రిలో తల్లి వద్దనే ఉన్నారు. ఇవాళ కూడా హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరముందని.. అందుకే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్‌ ఈడీకి విజ్ఞప్తి చేశారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మూడు రోజుల్లో రాహుల్‌ గాంధీని 30 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఆయన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రూపంలోనూ భద్రపర్చారు.