Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ గాంధీ తీరుపై ఈడీ అసంతృప్తి

ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉంది.

Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ గాంధీ తీరుపై ఈడీ అసంతృప్తి

Rahul Gandhi Ed

Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసులో రెండోరోజు ఈడీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణ ముగిసింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో 9 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈడీ అధికారులు రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీని ఈడీ ఎంక్వైరీ చేసింది. బుధవారం మరోసారి రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించనుంది. మరోసారి రాహుల్ గాంధీకి సమన్లు ఇవ్వనుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో నేటి విచారణలో కొన్ని ప్రశ్నలు పూర్తి కానందున రేపు మరోసారి ఈడీ ముందు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది ఈడీ.

Revanth Reddy Warns BJP : మిత్తితో సహా చెల్లిస్తాం, జైలుకెళ్లక తప్పదు- బీజేపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

కాగా, విచారణలో రాహుల్ గాంధీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉంది. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు రాహుల్ ఇవ్వడం లేదని ఈడీ వర్గాల సమాచారం. దీంతో మరోసారి రాహుల్ ను విచారించాలని ఈడీ నిర్ణయించింది. వరుసగా మూడో రోజు రాహుల్ ను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు.

మంగళవారం ఉదయం మూడు గంటల పాటు రాహుల్ ని ఈడీ అధికారులు విచారించారు. భోజన విరామం తర్వాత కూడా రాహుల్ ను విచారించారు. మరోవైపు మంగళవారం కూడా కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగాయి. ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో కొంతమంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్ జన్ పధ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బలగాలను మోహరించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఏఐసీసీ కార్యాలయం దగ్గర పరిస్థితులు రణరంగాన్ని తలపించాయి. రాహుల్, ప్రియాంక గాంధీ కలిసి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలు, లోక్ సభ పక్ష నేత రంజన్ చౌదరి సహా కీలక నేతలను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. మిగతా నేతలందరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేతలు ఎంపీలను అరెస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుకి నిరసనగా రాహుల్ గాంధీ కాసేపు నిరసన దీక్ష చేశారు.

Revanth Reddy National Herald : నాడు ఇందిర, నేడు సోనియా.. 2024లో రిపీట్ కాబోతోందన్న రేవంత్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. రాహుల్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించడం దుర్మార్గం అన్నారు. పోలీసులు అడ్డుకున్న ప్రాంతంలోనే చాలామంది నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విచారణ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు.