Kajal Aggarwal Husband Conditions For Her Shooting
Kajal Aggarwal: అందాల భామ కాజల్ అగర్వాల్ పెళ్లయినా కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె ఇప్పుడు తల్లి కూడా కావడంతో సినిమాల్లో నటిస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తున్నట్లు పేర్కొనడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె కమిట్ అయిన ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో త్వరలోనే జాయిన్ కాబోతుంది ఈ బ్యూటీ.
Kajal Aggarwal: గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించని కాజల్ అగర్వాల్!
తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’లో కాజల్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత కూడా కాజల్‌కు పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. కాగా, ఆమె భర్త గౌతమ్ కాజల్‌ను సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నాడట. అయితే ఆమె రొమాంటిక్ పాత్రలు, అసభ్యకరమైన సీన్స్, లిప్ లాక్స్‌కు దూరంగా ఉండాలని గౌతమ్ కండీషన్ పెట్టాడట.
Kajal Aggarwal: చంద్రముఖిగా కాజల్ అగర్వాల్..
దీంతో గ్లామర్ డోస్ లేకుండా కాజల్‌ను హీరోయిన్‌గా ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి భర్త పెట్టిన కండీషన్‌లతోనే కాజల్ సినిమా ఛాన్సులు కొట్టేస్తుందా, లేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందా అనేది చూడాలి.