Kajal Aggarwal: చంద్రముఖిగా కాజల్ అగర్వాల్..

పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. మళ్ళీ వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టార్ హీరోయిన్, నాలుగు నెలలకే షూటింగ్ లో పాల్గొని సౌత్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి బయటకి వచ్చింది.

Kajal Aggarwal: చంద్రముఖిగా కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal in Chandramukhi 2

Kajal Aggarwal: పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. మళ్ళీ వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టార్ హీరోయిన్, నాలుగు నెలలకే షూటింగ్ లో పాల్గొని సౌత్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి బయటకి వచ్చింది.

Kajal Aggarwal : మొదటిసారి తన బాబు ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్
ప్రముఖ డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న చంద్రముఖి-2 సినిమాలో కాజల్ కి ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చందమామ చంద్రముఖి పాత్రలో కనిపించనుందట. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా చంద్రముఖి సినిమాలో ఈ పాత్రను జోతిక నటించిన విషయం తెలిసిందే.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్.. ప్రస్తుతం ఆల్రెడీ కమ్మిట్ అయ్యిన కమల్ హాసన్ భారతీయుడు-2 సినిమాను పూర్తీ చేసే పనిలో పడింది. ఆర్ధిక సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ గతంలో ఆగిపోగా, మరల తిరిగి షూటింగ్ ప్రారంభించుకున్న శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వం వహిస్తుండగా,అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.