IPL 2026: ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్.. చెన్నై ఘన విజయం
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ దుమ్మురేపింది. ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 181 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో సీఎస్కేని చిత్తు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది హైదరాబాద్.
హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో హెన్రిచ్ క్లాసెన్ మెరుపు బ్యాటింగ్ ఆడాడు. 26 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు.
