Navy Jobs 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.56 వేల జీతం.. అస్సలు మిస్ చేసుకోకండి..!
Navy Jobs 2026 : ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త
Indian Navy SSC Executive Information Technology IT Recruitment for January 2027 Apply Online full details here
Navy Jobs 2026 : ఎలాంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం భారత నౌకాదళం (ఇండియన్ నేవీ)లో ఉద్యోగం సాధించాలనుకునే యువతీయువకులకు ఇది పండగలాంటి వార్త. నేవీలో చేరాలనే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. కేరళలోని ఎజిమలలో ఉన్న ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ (INA)లో 2027 జనవరి నుంచి ప్రారంభం కానున్న షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఐటీ కోర్సు కోసం ఇండియన్ నేవీ తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) విభాగంలో ఖాళీగా ఉన్న 15 పోస్టులను భర్తీ చేయనుంది. వివాహం చేసుకోని పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యా అర్హతలు:
- అభ్యర్థులు తమ టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- వీటితో పాటు కనీసం 60 శాతం మార్కులతో బీసీఏ (BCA) / బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ పూర్తి చేసి, దాంతో పాటు ఎంసీఏ (MCA) చదివి ఉండాలి.
- లేదంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాలలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, లేదా ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
- ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 1, 2002 నుండి జులై 1, 2007 మధ్య కాలంలో జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
- అభ్యర్థులు సాధించిన అకడమిక్ మార్కుల ఆధారంగా ముందుగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ఆ తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూ చేస్తుంది.
- ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు.
జీతం:
ఉద్యోగానికి ఎంపికైన వారికి ప్రారంభంలోనే నెలకు రూ. 56,100 ప్రాథమిక వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
సర్వీస్, శిక్షణ వివరాలు:
- మొదటగా అభ్యర్థులను 10 సంవత్సరాల సర్వీస్ కాలానికి విధుల్లోకి తీసుకుంటారు.
- ఆ తర్వాత నేవీ అవసరాలు, అభ్యర్థి ప్రతిభ ఆధారంగా దీనిని మరో 4 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమల నావల్ అకాడమీలో 6 వారాల పాటు కఠినమైన శిక్షణ ఇస్తారు.
అత్యంత ముఖ్యమైన నియమం
ఈ ఉద్యోగంలో చేరాలని భావించే వారు అస్సలు మర్చిపోకూడని నియమం ఏంటంటే.. ఈ శిక్షణా కాలంలో అభ్యర్థులు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ట్రైనింగ్ సమయంలో పెళ్లి చేసుకుంటే వారిని తక్షణమే విధుల నుండి తొలగిస్తారు.
