Kajal Agarwal : ఇండియన్ 2 కోసం గుర్రమెక్కిన కాజల్.. తల్లి అయ్యాక శరీరంలో చాలా మార్పులొచ్చాయి.. ఎమోషనల్ పోస్ట్..

గుర్రపు స్వారీ చేస్తున్న ఓ వీడియోని కాజల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ''బాబు పుట్టాక నాలుగు నెలల తర్వాత మళ్ళీ నా వర్క్ లోకి...........

Kajal Agarwal : ఇండియన్ 2 కోసం గుర్రమెక్కిన కాజల్.. తల్లి అయ్యాక శరీరంలో చాలా మార్పులొచ్చాయి.. ఎమోషనల్ పోస్ట్..

Kajal Agarwal Shares Horse Riding Video with Enotional Post

Kajal Agarwal :  సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చి తల్లి అయింది. ప్రస్తుతం తల్లిగా తన బాబుతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అయితే మళ్ళీ కెరీర్ మీద దృష్టిపెట్టింది. ఇండియన్ 2 సినిమాలో తాను నటిస్తున్నానని గతంలో ప్రకటించింది కూడా. తాజాగా ఇండియన్ 2 సినిమా కోసం శిక్షణ తీసుకుంటుంది కాజల్.

గుర్రపు స్వారీ చేస్తున్న ఓ వీడియోని కాజల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ”బాబు పుట్టాక నాలుగు నెలల తర్వాత మళ్ళీ నా వర్క్ లోకి వచ్చాను. గతంలో నా శరీరం ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదు. తల్లి అయ్యాక నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ఎక్కువ సేపు జిమ్ లో గడపాలి. గుర్రాన్ని ఎక్కడం, దానిపై స్వారీ చేయడం నాకు చాలా పెద్ద పనిలా అనిపించింది. శరీరంలో మార్పులు వచ్చాయి కానీ మనలోని నేర్చుకోవాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమే. బలంగా మన గోల్ కోసం ముందుకెళ్లాలి”

Rajamouli : బ్రిటిషర్లంతా విలన్లు కాదు.. కథని చూస్తే ఇవన్నీ ఆలోచించరు.. రాజమౌళి వ్యాఖ్యలు..

”ఇండియన్ 2 సినిమా కోసం ఇదంతా నేర్చుకుంటున్నాను. సినిమా పరిశ్రమ నా పుట్టిల్లు లాంటింది. ఎప్పటికప్పుడు నేను కొత్త స్కిల్స్ నేర్చుకుంటాను ఇక్కడ ఉండటం కోసం. సినిమా పరిశ్రమ నాకు కొత్త ఛాన్సులు ఇస్తున్నందుకు నేను రుణపడి ఉంటాను. సినిమాల కోసం కొత్తవి నేర్చుకుంటూ నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను” అని తెలిపింది. దీంతో కాజల్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.