Rajamouli : బ్రిటిషర్లంతా విలన్లు కాదు.. కథని చూస్తే ఇవన్నీ ఆలోచించరు.. రాజమౌళి వ్యాఖ్యలు..

రాజమౌళి దీనికి సమాధానంగా.. ''విలన్‌ పాత్రలో బ్రిటిష్‌ వ్యక్తి నటించినంత మాత్రాన బ్రిటిషర్లంతా విలన్లు కాదు. అందరూ అలా అనుకుంటే బ్రిటన్ లో ఈ సినిమా ఆడేది కాదు, కానీ అక్కడ....................

Rajamouli : బ్రిటిషర్లంతా విలన్లు కాదు.. కథని చూస్తే ఇవన్నీ ఆలోచించరు.. రాజమౌళి వ్యాఖ్యలు..

Rajamouli comments on RRR Movie

Rajamouli :  రాజమౌళి బాహుబలి సినిమాతోనే మన తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక RRR సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, టెక్నీషియన్లు, ప్రముఖులు.. చాలా మంది RRR సినిమాని అభినందించారు. ఇక హాలీవుడ్ లో అయితే రాజమౌళి మేకింగ్ కి చాలా మంది ఫిదా అయ్యారు. అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి రాజమౌళిని పిలుస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన సినిమాలు షోలు వేస్తున్నారు.

తాజాగా ఓ హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో RRR స్పెషల్ షో వేశారు. ఆ షో తర్వాత రాజమౌళి అక్కడి మీడియాతో ముచ్చటించారు. ఈ సమావేశంలో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలని మీడియాతో పంచుకున్నారు. అక్కడి మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలో RRR సినిమాలో బ్రిటిషర్లని విలన్లుగా చూపించారు అని ప్రస్తావిస్తూ కొంతమంది రాజమౌళిని ప్రశ్నించారు.

Singer Sunitha : వాళ్ళు నా పాటని ఇష్టపడతారా లేదా నా చీరల్ని, నా అందాన్ని ఇష్టపడతారో తెలీదు..

రాజమౌళి దీనికి సమాధానంగా.. ”విలన్‌ పాత్రలో బ్రిటిష్‌ వ్యక్తి నటించినంత మాత్రాన బ్రిటిషర్లంతా విలన్లు కాదు. అందరూ అలా అనుకుంటే బ్రిటన్ లో ఈ సినిమా ఆడేది కాదు, కానీ అక్కడ కూడా మంచి విజయం సాధించింది. సినిమా ప్రారంభానికి ముందు ఇవన్నీ కల్పితాలు అని నేను డిస్ల్కైమర్‌ వేస్తాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనేది ఒక కథ అంతే. ఈ విషయం అందులో నటించిన వాళ్లందరికీ తెలుసు. ఇది ఒక కథగా, సినిమాగా చూస్తే మనం ఇలాంటివి ఆలోచించము” అని చెప్పారు.